మనదేశంలో కొన్నేళ్ళ క్రితం జరిగిన నిర్భయ ఘటన ఎంత పెను సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. కదిలే బస్సులో అత్యంత కిరాతకంగా ఒక అమ్మాయిని ఢిల్లీ రాజధాని లో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు. దేశంలోని యువత అంతా గొంతెత్తి ఆందోళనలు చేపట్టగా దెబ్బకి నిర్భయ చట్టం కూడా పుట్టుకొచ్చింది. అయితే కేసు విచారణ కొన్నేళ్ల తరబడి సాగగా చివరికి కోర్టులో కొద్ది వారాల క్రితమే నిందితుడికి ఉరిశిక్ష విధించారు. నాలుగు రోజుల్లో సజీవంగా ఉన్న నలుగురు దోషుల ఉరికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇప్పుడు నెలకొంది.

 

ఇప్పటికే ఉరిశిక్షను జాప్యం చేసేందుకు చాలాసార్లు నిర్భయ దోషులకు ప్రయత్నించగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా వారి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో నిర్భయపై అనాగరికంగా ప్రవర్తించిన ముఖేష్ సింగ్ తన పై జైల్ లో అత్యాచారం జరిగింది అంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో సుప్రీంకోర్టు విషయంపై విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మ శాసనాన్ని నియమించింది. వారి ముందు ముఖేష్ సింగ్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు.

 

తీహార్ జైలు లో తనపై లైంగిక దాడి జరిగిందని కోర్టుకు విన్నవించుకున్న అతను అను తనలాగే శిక్షను అనుభవిస్తున్న సహ దోషి అక్షయ్ సింగ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు విన్నవించుకున్నాడు. అతను ఇంకా సంచలనంగా తీహార్ జైలు అధికారుల సహకారంతోనే ఘటన జరిగిందని కూడా చెప్పుకోవడం గమనార్హం. ఇకపోతే నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన ముఖేష్ వినిపించిన కొత్త వాదన అందరికీ ఆసక్తిని రేపుతోంది. ముఖేష్ తన ప్రాణం దాకా వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగిందంటూ చెప్పిన తీరు ఎన్నో సందేహాలను రేకెత్తిస్తోంది. చాలామంది అయితే చేసిన తప్పుని ఒప్పుకొని ఉరికంభం ఎక్కకుండా ఇలా డ్రామాలు ఆడుతూ తప్పించుకుంటున్నారు అని... వీళ్లు ఎప్పటికీ మారరు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: