చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం ఉన్న విషయం తెలుసిందే. దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల కాంబినేషన్ లో ఈ సినిమాపై అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ సినిమాకు రచన సహకారం కోసం ప్రముఖ రచయితలతో దర్శకుడు కొరటాల శివ చర్చలు జరుపుతున్నట్లు గా ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. చిరు సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో... ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా స్క్రిప్ట్ ను మాడిఫై  చేసే పనిలో పడ్డారట కొరటాల శివ. అయితే చిత్రీకరణ సమయంలో కొన్ని  మాడిఫికేషన్స్  కూడా చేస్తున్నారట. 

 

 

 అయితే మామూలుగా అయితే దర్శకుడు కొరటాల శివ తన రెగ్యులర్ రచయితలతో నే స్క్రిప్టు రెడీ చేస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం చిరంజీవి సినిమా కోసం తన రెగ్యులర్ రచయితల తో పాటు ప్రత్యేకంగా శ్రీధర్ సిపానని  కూడా జాయిన్ చేసినట్లు సమాచారం. శ్రీధర్ సీపాన రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరుంది. ఓ సినిమాను తెరకెక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్. ఈ క్రమంలోనే రచయితగా కొరటాల శివ సంప్రదించగా చిరంజీవి సినిమా కావడంతో శ్రీధర్ కూడా నో  చెప్పలేకపోయాడట. అయితే మామూలుగా కొరటాల శివ స్వతహాగా రచయిత కావడంవల్ల ఇప్పుడు వరకు ఇతర రచయితల అవసరం మాత్రం రాలేదు. 

 

 

కానీ  మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి... ఈ నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్ వర్క్ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని కొరటాల శివ భావిస్తున్నారట. దీంతో సినిమా కోసం డైరెక్టర్ కం  రైటర్ ఆయన శ్రీధర్ తో కలిసి పని చేసేందుకు నిర్ణయించారు కొరటాల శివ. ఈ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన  విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుంది అని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి లేని దర్శకుడిగా కొరటాల దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మెగాస్టార్ సినిమా కొరటాల  గత చిత్రాలకు మించి ఉంటుందనే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: