తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. నిర్మాతగా, హీరోగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుండి ఎన్నో గొప్ప సినిమాలొచ్చాయి. అయితే మోహన్ బాబు కొడుకులు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు స్టార్స్ గా ఎదగలేకపోతున్నారు. ఈ హీరోలకి మంచి హిట్ పడి చాలా కాలమైంది. విష్ణు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' 'ఓటర్' సినిమాలు రెండు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ సినిమాల తర్వాత మళ్ళీ విష్ణు సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇక మంచు మనోజ్ నటించిన  'ఒక్కడు మిగిలాడు' సినిమాకు కూడా దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.

 

ఇక తాగాజా ఈ బ్రదర్స్ ఇద్దరూ చెరొక సినిమాతో రావాలని ట్రై చేస్తున్నారు. విష్ణు 'మోసగాళ్ళు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఓ ఫారిన్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 'కన్నప్ప' సినిమా చేయబోతున్నానని.. బడ్జెట్ రూ.95 కోట్లని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతుందని 
అన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి 95 కోట్ల బడ్జెట్ అని చెప్పడమే. అదే ఒక హాట్ టాపిక్ గా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఇప్పుడు విష్ణు మార్కెట్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

ఇక మనోజ్ కూడా భారీ బడ్జెట్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'అహం బ్రహ్మాస్మి' అన్న పేరుతో పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నామని అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్లని అంటున్నారు. అయితే మనోజ్ మీద కూడా ఇంత బడ్జెట్ కేటాయించడం అంటే చాలా పెద్ద రిస్కే. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ చేస్తారో చూడాలి. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు లో బడ్జెట్ సినిమాలు తీసి సక్సస్ లు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి గాని ఒకేసారి ఈ భారి బడ్జెట్ సినిమాలేంటి ..అయ్యో పనేనా మంచు బ్రదర్స్ కి ఏమైంది ...ఇలాంటి పనులు చేస్తున్నారు .. అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: