బాలీవుడ్‌ సూపర్ యాక్ట్రెస్ కంగనా రనౌత్‌ గురించి పరిచయం అక్కర్లేదేమో. ఎంతో డౌన్ పొజిషన్ నుంచి, పర్వత శిఖరాలను అధిరోహించిన ఘనత ఆమెది. ఇక ఆమె సోదరి రంగోలి చందేల్‌ గురించి కూడా అందరికి తెలిసే ఉంటుంది. అక్క పేరును చాలా బాగా కాష్ చేసుకునే చాకచక్యం ఆమె సొంతం. ఇక ఈమె తరచూ సోషల్‌ మీడియాలో యేవో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎపుడూ వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం కూడా అందరికి విదితమే.

 

IHG

 

కాగా రంగోలి, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు, ట్విట్టర్ మీడియా వేదికగా ఒక సవాలు చేసింది. అదేమంటే, ప్రస్తుత హీరోయిన్‌లలో ఎవరైనా రూ. 60 కోట్ల నుండి, రూ. 100 కోట్ల బడ్జేట్‌తో లేడి ఓరియంటెడ్‌ సినిమాలు తీస్తే..  తన హెయిర్ పూర్తిగా కట్ చేసేసుకుంటుందట.. అంటే కాకుండా... తన అక్క కంగనా తన నటనను పూర్తిగా విరమించుకుని, విదేశ దారులు పడుతుందని ఈ సందర్భంగా సవాల్ విసిరింది. అయితే ప్రస్తుతం రంగోలి ట్వీట్‌ బాలీవుడ్లో పెను దుమారాన్నే రేపింది.

 

ఆమె మాటల్లోనే... ‘నేను భారత దేశ పరిశ్రమకు బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కంగనా కాకుండా ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా లేడి ఓరియంటేడ్‌ సినిమాలను రూ. 60 నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో తీసి, ఓ 200 కోట్లు గాని కొల్లగొడితే.. ఇక కంగనా తన నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. లేదంటే నా పేరు మార్చుకుంటాను.. లేదంటే తల వెంట్రుకలు కత్తిరించుకుంటాను’ అంటూ.. కొంచెం ఘాటుగా నడమంత్రపు సిరితో ట్వీట్‌ చేశారు. ఇక కంగనా ట్వీట్‌ చూసిన కొంతమంది...రెచ్చిపోతున్నారు.

 

IHG

 

ఒకరు రంగోళి ని ఉద్దేశించి, నీకు నడమంత్రం పెరిగిందని, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావని, మరొకరు.. ఒక వేళ ని అక్క సినిమాలు వదిలేస్తే దానికి కారణం నువ్వే అవుతావు అని, తన ప్రతిష్టను దిగజారుస్తున్నావని, వేరొకరు.. ప్రస్తుత హీరోయిన్లలో కంగనాకు ఏమాత్రం తీసిపోని వారు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు.  ఇందుకు రంగోలీ.. సమాధానంగా ... అలంటి వారెవరూ లేరని.. మా అక్కే తోపు అన్నట్టు బిల్డప్ ఇస్తోంది... ఇపుడీ ట్విట్స్ సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: