ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది.. దాంతో సినీ పరిశ్రమలో ప్రకంపణాలు పుట్టుకు వస్తున్నాయి. ఇప్పటికే భారీ ప్రాజెక్టులు కూడా వాయిదాలు వేసకుంటూ కరోనా భయానికి ఇంటి పట్టునే ఉంటున్నారు.  ఇటీవల మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్’ మూవీ షూటింగ్ కొన్ని రోజుల వరకు వాయిదా వేస్తున్నట్లు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.  సినిమా కోసం ఎంతో మంది బయటకు రావాల్సి ఉంటుంది.. దాని వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు.. అందుకు కొరటాల కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు.  ఈ కరోనా ఎఫెక్ట్ కొన్ని సినిమాలు కూడా వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. 

 

గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహెూ’ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది.  కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేక పోయింది. దాంతో ప్రభాస్ తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి చైనాను దాటి అనేక దేశాల్లో కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ సాహసం చేశాడనే చెప్పుకోవాలి. యూరప్ ఖండంలో ఓవైపు ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతుండగా, ప్రభాస్ అండ్ టీమ్ ఎంతో మొండిధైర్యంతో జార్జియాలో షూటింగ్ పూర్తి చేసింది.  ఈ సందర్భంగా దర్శకులు రాథా కృష్ణ మాట్లాడుతూ.. నిజంగా ప్రభాస్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అన్నారు. 

 

జార్జియాలో ప్రభాస్ పై ఓ చేజింగ్ సీన్ చిత్రీకరించామని, కేవలం 10 డిగ్రీల ఉష్ణోగ్రత... ఎముకలు కొరికే చలి ఓవైపు, కరోనా ముప్పు మరోవైపు... ఇవేమీ తమ చిత్రబృందం ఉత్సాహాన్ని అడ్డుకోలేకపోయాయి అన్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్నారు.  ఈ మూవీ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: