స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో మూడో చిత్రం తెరక్కనుందని తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కొత్త లుక్ లో లారీ డ్రైవర్ గా నటించనున్నాడట ఇక ఈచిత్రం నుండి విడుదలైన  బన్ని ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఆ ఫస్ట్ లుక్ అఫీషియల్  ది కాదు బన్ని వీరాభిమాని ఒకరు ఆ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. అంతే ఆ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనే అనుమానం రాకుండా సూపర్ గా ఎడిట్ చేయడం తో చాలా మంది నెటిజన్లు ఆపోస్టర్ నిజమేమో అనుకున్నారు కానీ అదినిజం కాదని తర్వలోనే ఫస్ట్ లుక్ ను విడుదలచేస్తామని చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. 
 
 
 
అన్ని కుదిరితే  అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెల 8న ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కనున్న ఈ సినిమా మే నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలావుంటే నా పేరు సూర్య తరువాత ఇటీవల అల.. వైకుంఠపురములో తో వచ్చి బన్ని కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 150కోట్ల వసూళ్లను రాబట్టి  సెన్సేషన్ సృష్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: