కరోనా అవుట్ బ్రేక్‌ తో ప్రపంచమంతా ఆందోళనలో ఉన్న సమయంలో పెద్ద వయసున్న ప్రముఖుల విషయంలో అభిమానులు ఆందోళన చెందు తున్నారు. ఈ సందర్భంలో లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్ తన ఆరోగ్య పరిస్థితి స్పందించారు. ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా సాధారణ ప్రజానీకతంతో పాటు సెలబ్రిటీలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

ముఖ్యంగా సీనియర్‌ నటీనటులు, టెక్నిషియన్స్‌, మ్యూజీషియన్స్‌ విషయంలో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన ఆరోగ్య పరిస్థితి పై ఓ జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు.

 

కరోనా వైరస్‌ కు వందలాది ప్రాణాలు బలవుతున్న తరుణంలో తాను ఇంట్లోని వ్యక్తులతో కూడా మాట్లాడటం లేదని ఆమె వెల్లడించారు. అంతేకాదు ఇటీవల ఆమె తీవ్రం అనారోగ్యానికి గురికావటం కూడా కుటుంబ సభ్యులకు భయాందోళనకు కారణమవుతుంది. ఇటీవల లతా మంగేష్కర్‌ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తో ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు.

 

ఆ సమయంలో ఫ్యాన్స్‌ ఆమె ఆరోగ్య పరిస్తితి పై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అభిమానుల ప్రార్థన లతో ఆమె ఆరోగ్యం గా తిరిగి ఇంటి వచ్చారు. తాజాగా కరోనా స్ప్రెడ్ అవుతున్న సమయంలో నేషనల్‌ మీడియాతో మాట్లాడిన ఆమె ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వెల్లడించారు.

 

`నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం లేదు. దూరం నుంచే ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుంటున్నా. నాకు సహాయం అందిస్తున్న ఇద్దరు వైధ్యులు, నర్సులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నా` అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: