ప్రస్తుతం వరుస సక్సెస్ ల సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన రెండవ సారి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని ఈ లాకౌట్ ముగిసిన అనంతరం మిగతా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తోంది యూనిట్. మెగాస్టార్ గత సినిమా సైరా నరసింహారెడ్డి ఆశించిన రేంజ్ విజయాన్ని అందుకోకపోవడంతో తప్పకుండా ఆయన ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి తీరుతారని మెగాఫ్యాన్స్ ఆచార్య పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

 

మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆయన ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలను దర్శకుడు శివ ఈ సినిమాలో మేళవించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య సినిమాని కొరటాల ఎంతో గొప్పగా తీస్తున్నారని, మంచి సోషల్ మెసేజ్ తో పాటు కొంత పొలిటికల్ టచ్ ఉన్న ఈ సినిమాలో తన క్యారెక్టర్ ని కొరటాల ఎంతో బాగా రాశారని, అలానే రామ్ చరణ్ పాత్రకు కూడా సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, కేవలం మెసేజ్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను అలరించే పలు కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చెప్పడం జరిగింది. 

 

తొలిసారిగా నెం, చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను అందరినీ కూడా ఆకట్టుకుంటుందని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు నుండి మొన్నటి భరత్ అనే నేను వరకు కెరీర్ పరంగా ఒక్క పరాజయం లేకుండా అన్నీ కూడా మంచి విజయాలే అందుకున్న కొరటాల, మెగాస్టార్ కు ఈ ఆచార్య ద్వారా ఏ రేంజ్ సినిమా ఇస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే... !!

మరింత సమాచారం తెలుసుకోండి: