IHG'Human Computer' Shakuntala ...

 ప్రపంచవ్యాప్తంగా కరోనా  మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలు ఈ కరోనా మహమ్మారి దెబ్బకు  వణుకుతున్నాయి. ఇక మన దేశంలో ప్రజలంతా ఇళ్ల కే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై చాలా ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని ఉండగా లాక్ డౌన్ కారణంగా అవి విడుదలకు నోచుకోలేదు. లాక్ డౌన్ అనంతరం విడుదల చేద్దామని అనుకున్న నిర్మాతలందరూ  లాక్ డౌన్ పొడిగించటం తో ఏం చేయాలో పాలుపోక సినిమాలను ఎలాగోలావిడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తాజాగా బాలీవుడ్  నటుడు అమితాబచ్చన్ నటించినటువంటి 'గులాబో సితాబో'  సినిమా ఈ  జూన్ 12 కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

IHG

 

ఈ కోవలోనే మరో హిందీ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశ  ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్త  శకుంతలా దేవి బయోపిక్ లో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి మనందరికీ  తెలిసినదే. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం యొక్క పోస్టర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి విద్యాబాలన్ . విద్యాబాలన్ ఈ చిత్రం లో శకుంతలా దేవి పాత్ర ను పోషిస్తున్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ గా 'హ్యూమన్ కంప్యూటర్' గా  పెట్టారు. శకుంతలా దేవి హ్యూమన్ కంప్యూటర్ గా చాలా క్లిష్టమైన సమస్యలను సెకన్ల వ్యవధిలో విశ్లేషణ చేసి చూపించేవారు. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా కూడా నటించారు. అయితే ఈమె శకుంతలా దేవి  కుమార్తె గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఓ టి టి ద్వారా విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఓ ప్రకటనలో ఇప్పటికే తెలియజేసింది. కానీ ఈ సినిమా విడుదల కు సంబందించిన  డేట్ ఫిక్స్ చేయవలసి ఉంది. ఈ సినిమాకు  అను మీనన్ దర్శకత్వం వహిస్తుండగా. విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: