టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా సరే పాన్ ఇండియా సినిమాలను చెయ్యాలని నిర్మాతలకు హీరోలకు ఎక్కువగా కోరికగా ఉంది. ఇప్పుడు కొందరు చిన్న చిన్న హీరోలు అయితే బాలీవుడ్ సినిమాల మీద కూడా ఫోకస్ చేసారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇక అక్కడ తమ సినిమాలకు ఆదరణ తీసుకుని రావాలని అందుకోసం వాళ్ళు ఇక్కడి నుంచే కష్టాలు పడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 

 

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ ఫేమస్ అయ్యాడు. అతను టాలీవుడ్ లో ఏ స్థాయిలో పాపులర్ అయ్యాడు అనేది పక్కన పెడితే బాలీవుడ్ లో మాత్రం చాలా వేగంగా పాపులర్ అయ్యాడు. అక్కడి హీరోలు దర్శకులు అందరూ కూడా అతని సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు అతని సినిమాల మీద అక్కడి జనం కూడా ఆసక్తి చూపించడం తో అక్కడ ఒక హీరో కి అతను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

 

అక్కడి ఒక హీరో కి హిందీ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఏ సినిమా కు వాయిస్ ఓవర్ ఇస్తాడో చూడాలి. షాహిద్ కపూర్ సినిమాకు అతను వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: