పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరాం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తుండగా ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు సినిమా కంప్లీటవొచ్చిందని సమాచారం. త్వరలో బ్యాలెన్స్ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఇక పరిస్థితులు చక్కబడితే రిలీజ్ కి ప్లాన్ చేయనున్నారు.   

 

ఇక దిల్ రాజు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నాడు. రెండు భాషల్లో 100 కోట్ల కు పైగానే వసూళ్ళు రాబట్టిన సూపర్ హిట్ సినిమా పింక్ ని మళ్ళీ మన నేటివిటీకి తగ్గట్టు ..పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్ని ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమాకి సంగీతమందిస్తుండగా ఇంతకముందే మగువా మగువా అన్న సాంగ్ రిలీజ్ అయింది. కాని అంతగా ఆకట్టుకోలేదన్న టాక్ వచ్చింది.

 

కాని ఇప్పుడు ఇదే సాంగ్ ని ప్రేక్షకులందరు ఎంతగానో ఆలపిస్తున్నారు. ఆడవారి గొప్పతనం గురించి కంపోజ్ చేసిన ఈ సాంగ్ సినిమాలో సిట్యువేషనల్ సాంగ్ అని సినిమాలో ఆ సాంగే ఎంతో హైలెట్ అవుతుందని యూనిట్ అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా కోర్ట్ సెట్ లో చిత్రీకరించిన సన్నివేశం నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకై సంచలనం అయింది. ఇది దిల్ రాజుని బాగా కంగారు పెట్టేసిందట. ఆ లుక్ ఎలా లీకైందో తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నాడట. ఇక ఈ విషయంలో యూనిట్ అందరికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: