మెగా మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ తన మామ నీడలో కాకుండా తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న  ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. ‘సోలో’ గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చెయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’’ అంటూ చిరు ట్వీట్ చేశారు. దీంతో ఆయన పెళ్లి కన్ఫాం అయింది. అంతకు ముందే సాయి తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే అంటూ ట్వీట్ చేయడం చూస్తుంటే తేజ్ పెళ్లి వార్తలు నిజమే ఫిక్స్ అయిపోయారు.

అందుతున్న సమాచారం మేరకు సాయిధరమ్ తేజ్ కోసం మూడు సంభందాలు చూశారట. అంటే చిరు ఆయన కోసం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశారనట్టు. వారిలో ఒకరిని సాయి ధరమ్ తేజ్ కోసం ఎంపిక చేసి పెళ్లి చెయ్యడం అనే భాధ్యతను పూర్తిగా చిరంజీవి మీదనే పెట్టారట.  వచ్చే ఏడాది వేసవిలో తన అల్లుడి పెళ్లి కోసం మెగాస్టార్ ఓ డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది.

ఇక ఈ ఏడాది చివర్లో మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి తో మొదలయ్యే పెళ్లి సందడి, సాయి ధరమ్ తేజ పెళ్లి దాక ఆ వాతావరణాన్ని కొనసాగించనున్నారన్న మాట. తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో చేస్తోండగా ఆ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. ఇస్మార్ట్ భామ నభా నటేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: