నయనతార.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. సక్సెస్ సినిమాలతో పాటుగా ఇండస్ట్రీ లో భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది.. ఈమెకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. లాక్ డౌన్ లో అందరూ ప్రేక్షకులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తే.. నయన్ మాత్రం బాయ్ ఫ్రెండ్ శివన్ గణేష్ ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే.. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు జాలిట్రిప్స్ వేస్తూ ప్రేమ పక్షులు లాగా విహరించారు. కాగా, ప్రస్తుతం సినిమాలు మొదలవ్వడం తో మళ్లీ సినిమాలలో నటిస్తుంది..తెలుగు , తమిళ్చిత్రాలతో బిజీగా ఉంది..రెండు ఇండస్ట్రీలో ఆమెకు ఎప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గదు..నయన్ తో సినిమాలు తీయడానికి దర్శక ,నిర్మాతలు డేట్స్ ఇవ్వమని అడగడం విశేషం..



నయన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం  'నెట్రికన్‌'. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.. ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగానూ మారుతున్నారు. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి 'గృహం' చిత్రంతో అందరి మన్ననలు పొందిన మిలింద్‌ రౌ దర్శకత్వం వహించగా,గిరీష్ జీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక సస్పెన్స్ కథాంశం తో ఈ సినిమా ఉండబోతుందని పోస్ట్ ను చూస్తే అర్థమవుతుంది..



తాజాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నయనతారసినిమా తీసిన కూడా అది సక్సెస్ అవుతుందని అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంటుందని సినీ వర్గాల్లో టాక్ వినపడుతుంది.  తమిళ సెలబ్రిటీలు  చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్‌ ట్విట్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ అమ్మడు ఖాతాలో మరో హిట్ పడినట్లే.. ఏది ఏమైనా కూడా లేట్ గా సినిమా న్యూస్ తో వచ్చిన నయన్ పై సినీ ఇండస్ట్రీ చర్చలు జరుగుతున్నాయి.. ఈ సినిమా తో పాటుగా మరో రెండు సినిమాలలో నటిస్తుంది..


 

మరింత సమాచారం తెలుసుకోండి: