ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. పెదనాన్న కృష్ణంరాజు సపోర్ట్ తో కెరియర్ ను సూపర్ ట్రాక్ లో పెట్టుకున్నాడు. ప్రభాస్ కెరియర్ లో వర్షం మొదటి సూపర్ హిట్ సినిమా అతనికి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా అది. అమ్మాయిల కలల రాకుమారుడిగా ప్రభాస్ మారాడు. ఇక ఛత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ తన స్టామినా చూపించిన సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ లో హీరో ఎలా పవర్ ఫుల్ గా ఉంటాడో చూపించిన సినిమా అది.

ఇక ఆ తర్వాత బుజ్జిగాడుతో తన స్టైల్ మార్చి డార్లింగ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ కూడా హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇక కొరటాల శివ మిర్చి సినిమాలో సూపర్ కూల్ గా కనిపించి అలరించాడు ప్రభాస్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సరికొత్త స్క్రీన్ ప్లేతో వచ్చిన మిర్చి ప్రభాస్ కెరియర్ లో అప్పటి వరకు హయ్యెస్ట్ కలక్షన్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక బాహుబలి 1, 2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి సినిమాలతో ప్రభాస్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. బాహుబలి రెండు పార్టులతో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా రిలీజై సూపర్ క్రేజ్ఞ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రాధే శ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా తన వంతు కృషిగా సత్తా చాటుతున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు నేషనల్ స్టార్ గా ఎదిగాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.               

మరింత సమాచారం తెలుసుకోండి: