బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ బొమ్మరిల్లు తర్వాత వచ్చిన సినిమా ఆరెంజ్. మగధీర తర్వాత రాం చరణ్ చేసిన ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవలేదు కాని ఆ సినిమాలోని సాంగ్స్, కొన్ని సీన్స్ ఇప్పటికి పాపులర్ అవుతున్నాయి. ఇక ఆ సినిమా తర్వాత పరుగుతో సత్తా చాటిన బొమ్మరిల్లు భాస్కర్ కెరియర్ వెనకపడ్డది. ఒంగోలు గిత్త లాంటి సినిమాలు అతన్ని మరింత వెనకపడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు భాస్కర్.

ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్దే లు రొమాన్స్ చేస్తున్నారు. సినిమా టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్ చూస్తే పెళ్ళి చేసుకోవాలనుకునే ఆలోచనలో ఉన్న అబ్బాయి రకరకాల పెళ్లిచూపులకు వెళ్లడం ఆ టైం లో అతను ఎలా ఫీల్ అయ్యాడు అన్నదే ఈ సినిమా కథ. ఇది కేవలం బ్యాచ్ లర్స్ కోసం కాదు.. పెళ్ళైన వారి కోసం అంతకన్నా కాదు. పెళ్లికి రెడీ అయిన వారి కోసమని అన్నాడు భాస్కర్.

అయితే టీజర్ చూస్తే సినిమా కొద్దిగా ఆరెంజ్ సినిమా పోకడలో వెళ్లినట్టు ఉదని అంటున్నారు. ఆరెంజ్ లో కూడా జీవితాంతం నిలిచే ప్రేమ కావాలని అంటూ భాస్కర్ చేసిన అటెంప్ట్ రివర్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా బ్యాచ్ లర్ కష్టాలని చూపిస్తూ పెళ్లికి ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లార్ సినిమాతో చూపిస్తున్నాడు. మరి ఈ బ్యాచ్ లర్ సినిమా ఆరెంజ్ అవూతుందా లేక బొమ్మరిల్లులా సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.                          



మరింత సమాచారం తెలుసుకోండి: