సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అయితే  సినిమాకు సంబంధించి మహేష్ యొక్క ప్రీ లుక్ ను మాత్రమే విడుదల చేసింది చిత్రబృందం ఆ పోస్టర్ లో మహేష్ బాబు జులపాలు పెంచుకున్న జుట్టుతో చెవికి పోగు తగిలించి రూపాయి గుర్తు టాటూ తో ఊర మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు.

పోస్టర్ చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మే నెలలో ఆ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం అయితే ఆ పోస్టర్ విడుదలైన కాసేపటికే ట్విట్టర్ లో రికార్డుల మోత ఎక్కించారు అభిమానులు. తమ హీరో ఒక్క పోస్టర్ లోనే ఇంత ఊర మాస్ లుక్ లో ఉంటే టీజర్ లో ఎలా ఉంటాడో.. అన్నా ఆతురత అభిమానులలో ఉంది. అందువల్లే ఈ చిత్రంపై అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే చిత్రం యొక్క దర్శకుడు పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

దర్శకునికి గతంలో  మాస్ ఎస్ సి సినిమాలు చేసిన అనుభవం లేనప్పటికీ తనలో ఊర మాస్ యాంగిల్ ఉందని పోస్టర్ తో నిరూపించాడు. అయితే ఈ సినిమా యొక్క కథ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ డబుల్ రోల్ చేస్తున్నాడు అని ఒక పుకారు షికారు చేస్తుంది. ఇప్పటివరకూ చిత్ర బృందం టీజర్ కు సంబంధించిన అప్డేట్ ఏమి ఇవ్వలేదు. మరి దీపావళి కైనా సినిమా యొక్క టీజర్ ను చిత్ర బృందం విడుదల చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: