టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ ది ముందు నుంచి కూడా ప్రత్యేక శైలి. రామ్ చరణ్ ముందు నుంచి సినిమాలు చేసే విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కాస్త ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య కాస్త కథల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు అని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో రామ్ చరణ్ గతంలో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది.

దీనికి ప్రధాన కారణం తన సినిమాల్లో ఎక్కువగా ప్రయోగాలు ఉండే విధంగా ప్లాన్ చేయడం అని అంటున్నారు. చిరంజీవి సలహాలను ఎక్కువగా తీసుకున్నా సరే కొన్ని ఇబ్బందులు మాత్రం రామ్ చరణ్ కి చాలా వరకు వస్తున్నాయని టాక్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని తెలియక పోయిన తర్వాత సినిమా విషయంలో మాత్రం రామ్ చరణ్ కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టాడని సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత... తర్వాత వచ్చే సినిమా మీద దృష్టి పెట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తో చర్చలు జరిపాడు. అయితే అనిల్ రావిపూడి చెప్పిన కథ మాత్రం రామ్ చరణ్ కి నచ్చిన సరే ఆ సినిమా కథ విషయంలో కొన్ని కొన్ని కోణాలు మాత్రం రామ్ చరణ్ కి నచ్చలేదు అని అంటున్నారు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు కానీ... కథలో హీరో పాత్ర విషయంలో కాస్త కామెడీ అయిపోయే విధంగా ఉంది అని కాబట్టే ఇప్పుడు ఆ కథ విషయంలో చిరంజీవి సహాయం తీసుకుంటున్నాడని టాక్. చిరంజీవి కూడా ఆ కధ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: