అక్కినేని నాగార్జున వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున మరోవైపు సినిమాల షూటింగ్ ని ఏమాత్రం ఆపడంలేదు.. అంతేకాదు వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే వైల్డ్ డాగ్ చిత్రాన్ని అంగీకరించి సెట్స్ మీదకు తీసుకెళ్లిన నాగార్జున మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. నాగార్జున చేస్తున్న గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి.. రాజిగారి గది 2 పర్వాలేదనిపించుకున్నా ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి..

అయితే ఆ డిప్రెషన్ నుంచి కోలుకుని వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు.  ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. మరో వైపు ప్రవీణ్ సత్తారు మూవీని నాగార్జున చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మరో వైపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను కూడా నాగ్ చేసేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెలలో బంగార్రాజు సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా ఈమూడు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటూ అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

ఇక ఈ మూడు సినిమాలే కాకుండా హిందీ లో బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్నాడు.  వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తానికి వచ్చే ఏడాదిలో నాగ్ కనీసం మూడు సినిమాలు అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. 2020లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక పోవడంతో నాగ్ వచ్చే ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అయన వారసులు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. అఖిల్ మోస్ట్ వాంటెడ్ బ్యాచ్లర్ సినిమా తో రిలీజ్ కి రెడీ గా ఉండగా, చైతన్య లవ్ స్టొరీ సినిమా ని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: