సాధారణం గా సినిమా ఇండస్ట్రీ లో హీరోల కొడుకులు హీరోలే అవుతుంటారు. ఇలా వారసత్వం ఎక్కువగా నటీనటుల విషయాలలోనే కనిపిస్తుంది. సంగీత దర్శకుల కొడుకులు సంగీతాన్ని వృత్తిగా ఎంచుకోవడం తక్కువే. కానీ కొంత మంది మాత్రం అలా లేరు. తండ్రుల బాటలో పయనిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మరి అలా సంగీత ప్రపంచంలో రాణిస్తున్న ఆ తండ్రి కొడుకులు ఎవరో చూడండి.



1. కోటి – రోషన్:

దశాబ్దం క్రితం ప్రతి సినిమాకు సంగీతం అందించిన జనతా రాజ్-కోటి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఒక్క వీరు విడిపోయి కోటి ఒక్కరే చాల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసారు. ఇక కోటి తండ్రి రాజేశ్వ‌ర్రావ్ కూడా మంచి సంగీత దర్శకుడే. సినీ పరిశ్రమ చెన్నై లో ఉండగా కోటి తండ్రి తమిళ్ తెలుగు భాషల్లో 50 సినిమాలకు పైగా సంగీతం అందించారు;. ఇక తండ్రి వారసత్వాన్ని కోటి కొనసాగించగా ఇప్పుడు కోటి తనయుడు రోషన్ సైతం సినిమాల్లో రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రోషన్ ఇప్పటికే నిర్మల కాన్వెంట్ సినిమాకు సంగీతం అందించి సంగీత దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.



2. మణిశర్మ – స్వ‌ర సాగ‌ర్ మ‌హ‌తి:

మణి శర్మ రాత్రి అనే సినిమాతో 1992 లో టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. మెలోడీ బ్రహ్మగా ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇక మణిశర్మ తనయుడు స్వ‌ర సాగ‌ర్ మ‌హ‌తి సైతం తండ్రి అడుగుజాడల్లో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే చలో, భీష్మ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు సాగ‌ర్.



3. కీరవాణి – కాల భైరవ:

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్నారు కీరవాణి. ఇక ఈయన కుమారుడు కాల భైరవ కూడా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మత్తు వదలరా , కలర్ ఫోటో వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: