నటి శైలజ ప్రియా....ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. హీరోయిన్ అవ్వాలనుకున్న ప్రియా చివరికి క్యారెక్టర్ నటిగా మారి, సీరియల్స్ లో మరియు అనేక సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ని పెంచుకుంటూ లేట్ వయసులో హాట్ గా కనిపిస్తుంది ప్రియా. చాలా మందికి ఈమెకి ఎంత వయసు ఉంటుందో తెలియాక సతమతమవుతూ ఉంటారు. అంత అందంగా ఉంటూ కుర్ర భామలకు పోటీ వచ్చేలా ఉంటుంది.


ప్రియా 20 మే 1978 లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల అనే ప్రాంతంలో మామిళ్ళ వెంకటేశ్వరరావు, కుసుమ కుమారి దంపతులకు జన్మించింది. ఈమె వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ప్రియా గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఇక ప్రియా చిన్నప్పటి నుండి హైదరాబాద్ లోనే పెరిగింది.



మిర్చితో మరొక స్థాయికి చదువుకుంటున్న సమయంలోనే ప్రియసఖి అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. 

ఆ సీరియల్ మంచి విజయం సాధించడం తో ప్రియకు వరసగా సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ సీరియల్ కి గాను ప్రియా కు నంది అవార్డు సైతం వచ్చింది. ఒక్కసారి బుల్లి తెర పై పేరు వచ్చాక సిల్వర్ స్క్రీన్ పై పైకి రావడం కష్టం. ఇదే జరిగింది ప్రియా విషయంలో కూడా. ఆమెకు వెండితెర పై కన్నా కూడా బుల్లి తెరపైననే ఎక్కువ స్టార్ డం లభించింది. .’సంఘర్షణ’, ‘లేడీ డిటెక్టివ్’, ‘మిసెస్ శారద’, ‘జ్వాల’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది ప్రియా. ‘చిరునవ్వుతో’, ‘ఢమరుకం’, ‘కత్తి కాంతారావు’, ‘మిర్చి’, ‘రాజకుమారుడు’, ‘అన్నయ్య’, ‘జయం మనదేరా, , ‘పండగ చేస్కో’ , ‘విన్నర్’, ‘బాబు బంగారం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘ఇద్దరమ్మాయిలతో’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో సైతం అలరించింది. 



ఇక మిరిచి లో రిచాకు తల్లి ఆమె కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత అనేక మంది తమ చిత్రాల్లో తాల్లోపాత్రలకు ప్రియని ఎంచుకుంటున్నారు. ఇక ప్రియా వ్యక్తిగత విషయానికి వస్తే ఆమెది ప్రేమ వివాహం. 2002 లో ఎం.వి.ఎస్.కిషోర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీరిద్దరికి నిశ్చయ్ ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రియా ని చూస్తే ఇప్పటికి ఒక టీనేజ్ కుర్రాడికి అమ్మ అంటే ఎవరు నమ్మరు. ప్రస్తుతం ప్రియా కొడుకు నిశ్చయ్ పదవతరగతి చదువుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: