చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండానే ఎదిగారు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయనకు నటించాలన్న కోరిక మాత్రం తన తండ్రి కొణిదెల వెంకట్రావ్ నుండి వారసత్వంగా లభించింది. ఎందుకంటే మెగాస్టార్ చిరజీవి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ పని చేసి పదవి విరమణ పొందారు కానీ ఆయనకు మాత్రం నటుడు అవ్వాలనే కోరిక బాగా ఉండేదట. అంతే కాదు చిరంజీవి సినిమాల్లోకి రాకముందే ‘జగత్ కిలాడీ' అనే సినిమా లో 1969లో మెగాస్టార్ తండ్రి వెంకట్రావ్ ఒక చిన్న పాత్రలో నటించారట. కుటుంబ బాధ్యతలు తన భుజాల పైన ఉండటం తో కొడుకు అయినా హీరో కావాలని చిరంజీవిని చాలా ఎంకరేజ్ చేసేవారట. ఆలా చిరంజీవి తండ్రి ప్రోత్సాహం తో ఇండస్ట్రీ కి వచ్చాడు.



కొడుకు సినిమాలో నటుడిగా..

సినిమాల్లో నటించలేకపోయాను అనే బాధ ఎప్పుడు ఉండేదట చిరంజీవి నాన్న గారికి. ఆ విషయం ఒకసారి తన బావగారైన అల్లు రామలింగయ్య తో పంచుకున్నారట. ఒకవేళ తాను నటన వైపే ఉండి ఉంటె మరిన్ని అవకాశాలు వచ్చేవేమో కానీ బాధ్యతల కారణం గా ముందుకు వెళ్లలేకపోయా అంటూ చెప్పేవారట. ఇక కొన్నాళ్ల తర్వాత బాపు దర్శకత్వం వహిస్తున్న మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఇదే సినిమాలో అల్లు రామలింగయ్య సైతం ఒక పాత్రలో నటిస్తున్నాడు. అయితే బాపు గారు ఒకరోజు ఆ సినిమాలో మినిస్టర్ పాత్ర కోసం ఎంత మంది నటులను చూసిన సెట్ అవ్వడం లేదు అంటూ అల్లు రామ లింగయ్య తో చెప్పగా ఆ పాత్ర లో మా బావ గారు చక్కగా సరిపోతారు అంటూ సలహా ఇచ్చారట. 


అందుకు బాపు గారు సైతం సరే అనడం తో మంత్రి పాత్రలో చిరంజీవి తండ్రి నటించాడు. కొడుకు సినిమాలో తాను ఒక పాత్ర వేయడం చాలా సంతోషాన్నిచ్చింది అంటూ వెంకట్రావ్ తెగ మురిసిపోయారట. అయితే చిరంజీవికి, అయన తండ్రికి కాంబినేషన్ సీన్స్ మాత్రం ఈ చిత్రం లో లేవు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో వుంది మీరు కావాలంటే ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: