ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. బిగ్ బాస్ సీజన్  4లో అభి ఎంత మంచి ప్లేయరో అందరికి తెలుసు. చూసే ప్రతి ప్రేక్షకుడు ఉంటే అభి లాగా ఉండాలిరా అని కోరుకుంటాడు. అతని క్యారెక్టర్, బిహేవియర్, మెచ్యూరిటీ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు అభి ఆడియన్స్ దృష్టిలో ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. అలాంటి స్టార్ ని ఘోరాతి ఘోరంగా అవమానిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి.. ఇక అసలు వివరాల్లోకి వెళితే...


నిన్నటి ఎపిసోడ్ లో సారీ సార్ తప్పయిపోయింది.. క్షమించమని కోరుకుంటున్నా.. అంటూ అభిజిత్ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి క్షమాపణ కోరినా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కనికరించలేదు. శనివారం నాటి ఎపిసోడ్ చూశాక అభిజిత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అభిని  కావాలని టార్గెట్ చేశారని  హోస్ట్ నాగార్జునపై ఫైర్ అవుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్‌కి అలాగే హోస్ట్ నాగార్జునకి సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్నారు.డియర్ నాగార్జున  బిగ్ బాస్ గారు మీకు దమ్ముంటే అభిజిత్‌ని బయటకు తోసేయండి చూద్దాం అని సవాలు విసురుతున్నారు. ఇక నాగార్జున పై ఒక రేంజ్ లో ట్రోల్ జరుగుతుంది.

ఎంతలా అంటే నాగార్జున ఇక హోస్టింగ్ చెయ్యటానికి భయపడే అంతలా.. నాగార్జున గారు కొంచెం కూడా కనికరం లేదా ఉత్త పుణ్యానికి ఎందుకయ్యా అభి ని టార్గెట్ చేస్తున్నారు. అసలు అతను చేసిన తప్పేంటి.. మీరు అంతలా యాక్షన్లు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది. అతన్ని ఈమాత్రం దానికే ఇంటి నుంచి బయటికి పంపిస్తారా. అతన్ని దమ్ముంటే బయటికి పంపండి.. అరాచకం ఎలా ఉంటుందో మేము నీకు చూపిస్తాం అంటూ సోషల్ మీడియాలో పలు కామెంట్ల తో నాగార్జునని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తూ తెగ ఆడుకుంటున్నారు నెటిజన్స్.. ఇక ఈ ట్రోల్ల్స్ దెబ్బకి నాగార్జున సరిగ్గా హోస్టింగ్ చేస్తాడో లేదో చూడాలి.. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో అప్ డేట్స్ తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: