సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిన్నటితో 41 వసంతాలను పూర్తి చేసుకున్నారు..హీరో కృష్ణ కుమారుడిగా సినిమా రంగంలో ప్రవేశించిన మహేష్ బాబు  చైల్డ్ ఆర్టిస్ట్ గా పాత్రలు  పోషించారు .. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేసినా మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా మారారు ..ఆలా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం లో వచ్చిన  రాజకుమారుడు అనే చిత్రంతో  హీరోగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు..

సినిమా మంచి  విజయం సాధించింది ..అక్కడినుంచి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు...ఆలా వరుస సినిమాలు హిట్ అవడం తో అతి తక్కువ  కాలం లోనే  సూపర్ స్టార్ గా ఎదిగారు..తనకంటూ  అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు ..  

మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఎన్నో ఘనతలని సాధించారు  .. మరియు నంది అవార్డ్స్ ని,  ఫిలింఫేర్ అవార్డ్స్ ని అందుకున్నారు  .. అంతే కాదు హ్యాట్రిక్ సినిమా విజయాలని కూడా మహేష్ బాబు సాధించారు. మామలు హీరో నుండి సూపర్ స్టార్ ని చేసిన చిత్రం ఒక్కడు మరియు పోకిరి.. ముంబై కి డాన్ గా నటించిన చిత్రం బిజినెస్ మ్యాన్ ,

మహేష్ బాబు ముఖ్య మంత్రిగా చేసిన చిత్రం భరత్ అనే నేను , ఒక కంపెనీకి సీఈఓ గా చేసిన చిత్రం మహర్షి , ఊరి దత్తత  అనే  కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం శ్రీ మంతుడు, రాక్ స్టార్ గా చేసిన చిత్రం 1 నేనొక్కడినే, అలాగే మల్టీ స్టార్ గా చేసిన తొలి చిత్రం సీతమ్మ వాటిక్లో సిరిమల్లె చెట్టు  ..ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి ..మహేష్ నటించిన సినిమాలలో ఫెయిల్యూర్ శాతం చూస్తే చాలా తక్కువే అని చెప్పవచ్చు ..  
 
మహేష్ బాబు  చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన  మొదటి చిత్రం నీడ అది విడుదలై  నిన్నటితో 41 సంవత్సరాలు పూర్తయ్యాయి.. మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమకి వచ్చి 41  సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  అతని భార్య నమ్రతా శిరోద్కర్ సూపర్ స్టార్ కి శుభాకాంక్షలు తెలియజేసారు ..ఇలాంటి ఘనతలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.. 

మహేష్ బాబు  ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతుంది.. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా  నటిస్తోంది..  మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ సంయుక్తంగా  కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: