లక్ష్మి పార్వతి..ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్యేక పరిచయం చేయక్కర్లేదు. ఎన్టీఆర్ వంటి మహానాయకుడికి ఇల్లాలిగా, ప్రస్తుతం వైసీపీ పార్టీలు క్రియా శీలక పాత్రలో ఆమె ఉన్నారు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం, తొలినాళ్లలో ఆమె చుసిన జీవితం రెండు భిన్న ధృవాలు. తినడానికి తిండి సైతం లేని ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలిలో పుట్టిన లక్ష్మి పార్వతి కి చదువు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే మొదట వీరగంధం వెంకట సుబ్బారావు కి రెండవ భార్యను చేస్తే, ఆ తర్వాత ఆ చదువే ఎన్టీఆర్ కి సైతం రెండవ భార్యను చేసింది.

మొదట లక్ష్మి పార్వతి కి చదువు పై ఆసక్తి ఉండటం తో ఆమె మాష్టారు వీరగంధం సుబ్బా రావు కి ఆమె గురించి చెప్పగా అయన చదివించడానికి ముందుకు వచ్చారు. సుబ్బారావు ఇంట్లోనే ఉంటూ చదువుకున్న లక్ష్మి పార్వతి తర్వాతి రోజుల్లో ఆయననే పెళ్లాడింది. సుబ్బారావు కి అప్పటికే పెళ్ళై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. భార్య చనిపోవడంతో ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతున్న సుబ్బారావు ని మరో పెళ్లి చేసుకోమని అయన కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో సరే అన్నారు. కానీ తన కన్నా వయసులో చాల చిన్న అయినా లక్ష్మి పార్వతిని చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో లక్ష్మి పార్వతి తనని ఎలాగైనా పెళ్లి చేసుకొమ్మని లేదంటే బలవన్మరణం చెందుతానని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో సుబ్బారావు ఆమెను పెళ్లాడారు.

వీరికి ఒక కుమారుడు సైతం జన్మించాక పై చదువుల కోసం హైదరాబాద్ కి మకాం మార్చి అక్కడ ఎన్టీఆర్ తో చనువు పెంచుకొని చివరికి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, ఎన్టీఆర్ కి రెండవ భార్య గా సెటిల్ అయ్యింది. ఇలా ఆమెకు చదువు అనే ఒక విషయం ద్వారా రెండు సార్లు ఇద్దరికి రెండవ భార్యగా దగ్గర అయ్యింది. విచిత్రం ఏమిటి అంటే మొదటి భర్త పెళ్లి చేసుకోను అంటే చనిపోతే అని చెప్పి బ్లాక్ మెయిల్ చెస్ పెళ్లి చేసుకోగా, ఎన్టీఆర్ తో వివాహం కోసం మొదటి భర్తను దుర్మార్గుడిగా చూపుతూ అయనతో చనువు పెంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: