సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. వాళ్ళని వెండి  తెర మీద చూసి తెగ మురిసిపోతూ ఉంటాము. సినిమా వాళ్లు అంటే డబ్బులు బాగా సంపాదిస్తారు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటారు. కానీ అలా అనుకోవడం పొరపాటు.వాళ్ళకి కుడా మనకి తెలియని బాధలు ఉంటాయి.  ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి  అయితే మరీ దారుణం. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లైఫ్ కూడా అంతే. ఆవిడకి ఏమైంది  స్టార్ హీరోయిన్ కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు ఆమె పెద్ద స్టార్ హీరోయిన్.కానీ ఈమెకు ఒకప్పుడు ఉన్న కష్టాలు తెలిస్తే మీకు  కన్నీరు ఆగవు.  పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. తెలుగులో ఈయన దాదాపు 54 సినిమాలు చేసాడు.రాజేష్  తాగుడుకు బానిసై 38 ఏళ్ల వయసు అప్పుడే చనిపోవడంతో ఆయన కుటుంబం దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. దాంతో ఐశ్వర్య రాజేష్  వాళ్ళ అమ్మ తన ముగ్గురు పిల్లలతో చాలా కష్టాలు పడింది. ఇద్దరు కొడుకులు, కూతురు ఐశ్వర్యను పెంచడానికి చాలా తంటాలు పడింది. రాజేష్ చనిపోయిన తర్వాత అప్పుల వాళ్లు  వచ్చి ఇంటిమీద పడితే చివరికి టి నగర్‌లో ఉన్న ఒక్క ప్లాట్ కూడా అమ్మేసి వాళ్ల అప్పులన్నీ తీర్చేసింది ఐశ్వర్య వాళ్ళ అమ్మ.

తర్వాత ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉండి చాలా కష్టాలు పడింది. ఐశ్వర్య వాళ్ళ అన్నయ్య  ఉద్యోగం చేస్తున్నాడు కష్టాల నుంచి గట్టు ఎక్కవచ్చు అనే సమయానికి  యాక్సిడెంట్‌లో ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి చనిపోయారు. దాంతో ఐశ్వర్య రాజేష్ ఒకేసారి ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత ఆడపిల్ల అయిన ఐశ్వర్య  కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది. ఆ సమయంలో సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది.ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్.ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఈమె ఈ స్టార్ ఇమేజ్ అనుభవిస్తుంది.  ఐశ్వర్య ఎన్నో తమిళ, మలయాళ, హిందీ, తెలుగు సినిమాల్లో  నటించింది.

ఐశ్వర్య ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. తన జీవితం వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు కూడా ఉన్నాయి. నల్లగా ఉన్నావ్.. నువ్వెక్కడ హీరోయిన్ అవుతావ్ అని అందరు ఆట పట్టిస్తుంటే కూడా పట్టు వదలని విక్రమార్కుడు లాగా పోరాడి ఈ రోజు స్టార్ అయింది ఈమె. అలాగే ఐశ్వర్య రాజేష్ కుటుంబంలోని అఅందరూ సినీ ఇండస్ట్రీలోని వారే అవటం విశేషం. ఆమె తాత గారు అమర్‌నాథ్ కూడా పెద్ద నటుడు. ఆయన తెలుగు, తమిళంలో వందల సినిమాలు చేసాడు. అలాగే రాజేష్ వాళ్ళ అక్క మరెవరో కాదు కమెడియన్  శ్రీలక్షి. ఆమె తెలుగులో 500 సినిమాలకు పైగానే నటించింది. ఐశ్వర్య రాజేష్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలూ అనుభవించి ఈ స్థాయికి వచ్చింది.. కష్ట పడే వాళ్ళకి ఎప్పటికన్నా ఫలితం వస్తుందనడానికి ఈమె జీవితమే ఒక ఉదాహరణ.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: