ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. రామ్ తాజా చిత్రం "రెడ్ " సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. రామ్ గత సినిమా "ఇస్మార్ట్ శంకర్" బ్లాక్ బస్టర్ కావడంతో రామ్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. దాంతో రెడ్ మూవీ మంచి అంచనాలతో విడుదల అయింది. అయితే సినిమా మొదట యావరేజ్ టాక్ తో మొదలై ప్రస్తుతం స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన 7రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు వరకు వసూళ్లు సాధించింనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 3.5 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇంకొన్ని రోజుల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాను మలయాళంలో కూడ విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను అక్కడ కూడా భారీగానే రిలీజ్ చేయాలని అని భావిస్తోంది చిత్ర బృందం. సుమారు 104 థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. రామ్ కెరీర్ లో ఇదే అతి పెద్ద మలయాళ రిలీజ్.

అయితే రామ్ సినిమాలు గతంలో కూడా మలయాళంలో డబ్బింగ్ కావడంతో ఈ సినిమాను కాస్త గ్రాండ్ గా విడుదల చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా అక్కడ కూడ విజయవంతం అయితే రామ్ కు మలయాళంలో కూడ మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు మలయాళంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అక్కడి స్టార్ హీరోలకు ధీటుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో సాలిడ్ మార్కెట్ ఉంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి కాస్త చెప్పుకోదగ్గ మార్కెట్ వుంది. మరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ "రెడ్" సినిమాతో వారి పక్కన చేరతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: