టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు భారీ సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు ఇంత వరకు తన కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ పాత్రను ఈ మూవీలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్ర కోసం పూర్తిగా హెయిర్ స్టైల్ ను మార్చేసిన మహేష్ బాబు శారీరకంగా కూడా బాగా బాడీ బిల్డప్ చేసి ఎంతో ఫిట్ గా తయారయ్యారు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీ అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా భారీ ఖర్చుతో నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరొక నాలుగు రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీని కోసం ఇప్పటికే మహేష్ బాబు సహా యూనిట్ మొత్తం దుబాయ్ చేరుకున్నారు. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించనున్నాడట దర్శకుడు పరశురామ్. అయితే దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళితో ఒక సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీపైడిపల్లి తో కూడా మరొక రెండు సినిమాలు చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కొద్ది రోజుల క్రితం స్వయంగా రాజమౌళినే తన తదుపరి సినిమా మహేష్ తో చేయనున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్న రాజమౌళి అది పూర్తయిన తర్వాతనే మహేష్ సినిమా గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది. అయితే వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తో కూడా మహేష్ సినిమాలు ఉంటాయని వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ వాటిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. మరోవైపు పలువురు ఇతర టాలీవుడ్ హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ కొనసాగుతుండటం ఇక ప్రస్తుతం మహేష్ కేవలం సర్కారు వారి పాట సినిమా మాత్రమే ఒప్పుకొని ఉండటంతో ఈ విషయమై మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ బాబు ఒకింత వెనుకబడి ఉన్నారని అంటున్నారు. అయితే రాబోయే మరికొద్ది రోజుల్లో మహేష్ నటించబోయే తదితర సినిమాలకు సంబంధించి అధికారిక న్యూస్ బయటకు రానుందని అప్పటి వరకు అభిమానులు ప్రేక్షకులు సంయమనం పాటించాలని మహేష్ సన్నిహితుల నుండి సమాచారం వెలువడుతున్నట్లు తెలుస్తోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: