ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడి చేస్తున్నారు మూవీ టీం.ఈ శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రెంచ్.. ఆస్ట్రేలియన్.. ఇటాలియన్ ఇలా 46 భాషల్లో శాకుతంలం నాటకంగా  ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న సమంతసినిమా షూటింగ్ కోసం రెడి అవుతుంది. ఈ సినిమాలో ఆమె లుక్ అంత డిఫరెంట్ గా ఉండబోతుంది అని టాక్ . తనతో ఈ సినిమా షూటింగ్ ని మూవీ టీం మార్చి లో మొదలుపెట్టబోతుంది. భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రం కోసం మూవీ టీం హాలీవుడ్ టెక్నేషన్స్ తో మూవీ షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఈ మధ్య సమంత సినిమాల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. అయితే ఈ సినిమాని సమంత హీరోయిన్ గా చేస్తుంది అంటే ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా 2022 లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: