సునీల్ లీడ్ రోల్ లో వి.ఎన్.ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న సినిమా మర్యాద కృష్ణయ్య. ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. సినిమా కథ ఏంటన్నది తెలియదు కాని రాజమౌళి డైరక్షన్ లో మర్యాద రామన్న సినిమాతో హిట్ అందుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా సినిమలైతే చేశాడు కాని పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఈమధ్య మళ్లీ కమెడియన్ పాత్రల్లో నటిస్తున్న సునీల్ కొత్తగా మర్యాద కృష్ణయ్య సినిమా చేస్తున్నాడు.

మనసంతా నువ్వే లాంటి సినిమా తీసిన వి.ఎన్ ఆదిత్య సునీల్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. సెన్సిటివ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నా సరే వి.ఎన్ ఆదిత్య ఈమధ్య సినిమాలు తీయడం ఆపేశారు. మళ్లీ వి.ఎన్ ఆదిత్య మర్యాద కృష్ణయ్య సినిమాతో ఫాం లోకి రావాలని చూస్తున్నారు. మర్యాద సెంటిమెంట్ తో వస్తున్న సునీల్.. కొద్దిపాటి గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్న వి.ఎన్.ఆదిత్య ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సునీల్ బర్త్ డే సందర్భంగా మర్యాద కృష్ణయ్య సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వి.ఎన్.ఆదిత్య కూడా సునీల్ మర్యాద కృష్ణయ్యతో మళ్లీ తన డైరక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా అప్డేట్ త్వరలో వస్తాయి.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: