మహేశ్‌ రెమ్యునరేషన్ తీసుకుని చాలాకాలం అయింది. ప్రతి సినిమాలోనూ  ఆయనే పార్టనర్‌  కావడంతో.. పారితోషికం అంతా పర్సెంటేజ్‌ ప్రకారం నడుస్తోంది. డిజిటల్‌.. శాటిలైట్‌... హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను మహేశ్‌కు ఇచ్చేస్తున్నారని టాక్‌. ఇలా సరిలేరు నీకెవ్వరు 50 కోట్లు తీసుకొచ్చిందట.

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. నిర్మాత ఎవరైనా.. పోస్టర్‌ పైన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ అని ఉంటే.. మహేశ్‌బాబు పార్టనర్‌ కిందే లెక్క. సరిలేరు నీకెవ్వరు 50 కోట్లు తీసుకొస్తే... సర్కారు వారి పాట 60 కోట్లకు పైగా తెచ్చిపెడుతుందని అంచనా.

రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కొణిదల ప్రొడక్షన్స్‌లో తప్ప బైట బేనర్‌లో నటించలేదు. ఈమధ్యనే బైట నిర్మాతల బేనర్‌లో లూసిఫర్‌ రీమేక్ చేస్తున్నాడు. 40 కోట్లతోపాటు.. రైట్స్‌ కూడా ఇస్తున్నట్టు సమాచారం. తమ్ముడు 50 కోట్లలో వుంటే.. అన్నయ్య  కూడా అదే రేంజ్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు.

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా 50 కోట్ల బాటలోనే నడుస్తున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌తోపాటు..ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బేనర్‌లో కల్యాణ్‌రామ్‌ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎలాగూ అన్నయ్యే నిర్మాత కాబట్టి.. లాభాల్లో షేర్‌ వస్తుంది. ఇదికాకుండా..  రెమ్యునరేషన్‌కింద  40 కోట్లు తీసుకుంటున్నాడన్నది ఇన్‌సైడ్‌ టాక్‌.

బన్నీ రెమ్యునరేషన్‌ గురించి చెప్పాలంటే.. అల వైకుంఠపురంలోకు ముందు ఒక లెక్క.. ఆతర్వాత మరో లెక్క. అల వైకుఠపురంలో బ్లాక్‌బస్టర్‌ తర్వాత  బన్నీ రెమ్యునరేషన్ అమాంతం పెరిగి 40 కోట్లకు చేరిందట. కొరటాల శివ సినిమాకు ఎక్కువే దక్కనుంది. ఈ  సినిమాను కొరటాల, బన్నీ ఫ్రెండ్స్‌ కలిసి నిర్మిస్తున్నారు కాబట్టి షేర్‌ రూపంలో  మరిన్నికోట్లు చేతిలో పడనున్నాయి.   మొత్తానికి మహేశ్ బాబు పారితోషితం విషయంలో ఎపుడూ ప్రత్యేకతే చూపిస్తాడు. ఇపుడు హిందీ డబ్బింగ్ రైట్స్ గురించే అంతా చర్చ జరుగుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: