తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ నటి సాయి పల్లవి ఆ మూవీతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో పాటు అందులోని తన ఆకట్టుకునే నటన, అందం, డ్యాన్స్ లతో యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తో పాటు ఇందులోని సాంగ్స్ కూడా విశేషమైన ప్రేక్షకాదరణ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత నుండి తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన మరొక్కసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీ తో పాటు వేణు ఉడుగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో కూడా నటిష్తోంది. అయితే ఈ రెండు సినిమాల నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు లిరికల్ వీడియో సాంగ్స్ కూడా యూట్యూబ్ లో ప్రస్తుతం మంచి ఆదరణ తో కొనసాగుతున్నాయి. కాగా వాటిలో లవ్ స్టోరీ మూవీ నుండి రిలీజ్ అయిన సారంగ దరియా సాంగ్ అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో 8.4 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 370కె కి పైగా లైక్స్ తో దూసుకెళుతోంది. 

చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల్లో ఈ సాంగ్ మరింతగా వ్యూస్, లైక్స్ దక్కించుకునే ఛాన్స్ కనపడుతోందని, గతంలో సాయి పల్లవి నటించిన రౌడీ బేబీ సాంగ్ ఇటీవల ఒక బిలియన్ కి పైగా వ్యూస్ దక్కించుకోగా, ఫిదా మూవీ లోని వచ్చిండే సాంగ్ కూడా వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా స్టార్ హీరోలని తలదన్నే రీతీలో ప్రస్తుతం సాయి పల్లవి సాంగ్స్ కి ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడం ఎంతో గొప్ప విషయం అని పలువురు ఆమె ఫ్యాన్స్, ఆడియన్స్ ఆమెకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: