సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఆ సినిమా తర్వాత సందీప్ కి తెలుగులో మళ్లీ హిట్ రాలేదు. ఇక తెలుగు సినిమాలని  కొంచెం పక్కన పెట్టి సందీప్ తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో నగరం సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే కొన్ని  సినిమాలో అతిధి పాత్రలో కూడా చేశారు. ఇలా తెలుగులో మరియు తమిళంలో సినిమాలు చేసుకుంటూ సందీప్ కిషన్ తన కెరీర్ ని లాగుకుంటు వస్తున్నాడు . అయితే తన కొత్త సినిమా ఏ వన్ ఎక్స్ప్రెస్ కూడా సరిగా ఆడక పోతే సందీప్ కిషన్ కి నిజంగానే తెలుగులో సినిమాలు కష్టమేనని ట్రేడ్ మాట్లాడుకుంటుంది. తమిళంలో హిట్టయిన నాట్ప్ తునై   సినిమాని తెలుగులోకి ఏ వన్ ఎక్స్ప్రెస్ గా రీమేక్ చేస్తున్నారు సందీప్ కిషన్. తమిళ్ లో లాగే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సందీప్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . అలాగే ఆ మధ్యనే విడుదలైన ఈ సినిమా పాట సింగిల్ కింగులం కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది .ఇక లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జీవన్ డైరెక్షన్ చేస్తున్నారు. తమిళంలో సినిమాకి హీరోగా నటించిన హిప్ హాప్ తమిళన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈరోజు ఘనంగా విడుదలయ్యింది. ప్రస్తుతం బయట టాక్ ని చూస్తుంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే ఉన్నారు. రివ్యూస్ కూడా అన్ని సందీప్ కిషన్ కి అనుకూలంగానే వస్తున్నాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ కి ఒక మంచి హిట్ వచ్చింది అని సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: