పవర్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ సినిమా "వకీల్ సాబ్". ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. వకీల్ సాబ్ విజయవంతంగా రెండో వారం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న నేప‌థ్యంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ... సినిమా మొదలుపెట్టిన రోజే అనుకున్నాం...ఇది ఎంత పెద్ద సినిమా అయితే  మనం అంత విజయం సాధించినట్లని. ఎంత పెద్ద సినిమా అంటే డబ్బుల వసూళ్ల పరంగా కాదని ఎంతమంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది అనేది మా లక్ష్యమ‌ని అన్నారు.  వకీల్ సాబ్ సక్సెస్ మీట్ రోజు కూడా ఇదే చెప్పానని దిల్ రాజు గుర్తు చేశారు. డబ్బులు వస్తుంటాయని అది ముఖ్యం కాదని దిల్ రాజు వ్యాఖ్యానించారు. టీవీ, థియేటర్, ఓటీటీ ఇలా మూడు విధాలుగా నిర్మాతకు డబ్బులు వస్తాయని అన్నారు. థియేటర్లో తాము ఎక్స్ ట్రీమ్ గా వెళ్లిపోయామ‌ని... ఈ కొవిడ్ టైమ్ లో ఎంత మంది చూడాలో అంత కంటే ఎక్కువే చూస్తున్నార‌ని అన్నారు. థియేటర్లకు ప్రేక్ష‌కులు రిపీటెడ్ గా వస్తున్నారని అన్నారు. 

ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయని ...వయసైన వారు థియేటర్లకు వెళ్లడానికి భయపడితే రేపు ఓటీటీ లేదా టీవీలో సినిమా చూస్తార‌న్నారు. ఒకటికి పది సార్లు సినిమా చూస్తాడనే నమ్మకం మాకుందని దీమా వ్య‌క్తం చేశారు.  ఇలా ప్రజలకు సినిమా రీచ్ అవడంలో, రెవెన్యూ విషయంలో మేము సూపర్ హ్యాపీ అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. అనుకున్నది సాధించామ‌ని..అడ్డంకులు దాటామ‌ని చెప్పారు.  కొవిడ్ దాటాం, ఇప్పుడు థియేటర్లో అనుకున్న రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంద‌న్నారు. తాను సినిమా చేసినప్పుడు  దర్శకులతో ఒకటే చెబుతానని...చేసిన సినిమా వల్ల సంతృప్తి రావాలన్నారు. రెండోది ఎకానమి అని, నిర్మాతగా డబ్బు కూడా ముఖ్యమేన‌ని అన్నారు. వకీల్ సాబ్ తో ఈ రెండు విషయాల్లో సంతోషంగా ఉన్నామ‌ని తెలిపారు. మూడోది ఆడియెన్స్ మనసుల్లోకి వెళ్లే సినిమాలు అరుదుగా ఉంటాయ‌ని...వకీల్ సాబ్ అలాంటి సినిమా అయినందుకు మరింత ఆనందంగా ఉందన్నారు. మరో టైమ్ లో సినిమా విడుదల చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో అని కొందరు అంటున్నారు. కానీ రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: