జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. కుటుంబ కథ చిత్రాలతో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు.. ఇప్పుడు వరుస సినిమాలతో పుల్ బిజీగా మారిపోయారు. కేవలం హీరోగానే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల విలన్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు.

అయితే జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇన్ని కోట్లు సంపాదించడానికి గల కారణం ఏంటో ఈ మద్యనే ఒక హీరోయిన్ బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు అర్జీవి తీసిన నగ్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీ పాకా అలియాస్ దేవరపల్లి స్వీటీ. ఆమె జగపతి బాబు గురించి మనకు తెలియని చాలా విషయాలు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆమె ఒకప్పుడు జగపతి బాబు కి కాస్టూమ్ డిజైనర్ గా పని చేసేదానిని అని అప్పట్లో ఆయనతో మంచి సంబంధం ఉందని ఆమె చెప్పారు. అలాగే జగపతిబాబు కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ధైర్యం చెప్పానని నిన్ను చూస్తే నాలో ఏదో తెలియని ధైర్యం వస్తుంది అని జగపతిబాబు అనేవారు అని ఆమె అన్నారు.

జగపతి బాబు ఇన్ని కోట్లు సంపాదించాడానికి గల కారణం ఆయనలో ఉన్న పాజిటివ్ మైండ్ అని ఏది ఆయన సీరియస్ గా తీసుకోరు అని ఆమె చెప్పారు. ఇక ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో మరియు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు కూడా వరుసగా స్టార్ హీరోస్ తో విలన్ గా సినిమాలని ఒప్పుకుంటు బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ ఒక్క సినిమాకి కోటి నుంచి రెండు కోట్లవరకు తీసుకుంటున్నాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఈ రేంజ్ లో ఇవ్వడం నిజంగా గొప్ప విశేషం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: