టాలీవుడ్ లో ప్రస్తుతం అంత యంగ్ రక్తం ప్రవహిస్తుంది. స్టార్ హీరోస్ తమ కొడుకుల్ని ఇండస్ట్రీలోకి పరిచయం చేసి వాళ్ళకి మంచి హిట్ కథలని ప్రత్యేకంగా ఎంపిక కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ కొడుకులకి హిట్స్ వస్తున్నాయి కానీ ఫాథర్స్ కి మాత్రం హిట్స్ రాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ లిస్ట్ లో మొదటగా నాగార్జున గురించి మాట్లాడుకోవాలి.

నాగార్జున కొడుకు నాగ చైతన్య వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజిగా ఉన్నారు. హిట్స్ విషయంలో కూడా ఆయనకి మంచి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక అఖిల్ విషయం పక్కన పెడితే ఫాథర్ నాగార్జున కి ఈ మధ్య ఒక్క సరైన హిట్ లేక చాలా ఇబ్బంది పడుతూన్నారు.ఆయన చేసిన మన్మథుడు 2 , వైల్డ్ డాగ్ సినిమా సినిమాలు భారీ ప్లాప్స్ గా నిలిచాయి. ఆయనికి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కావాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి సినిమాతో కొంచెం డీలా పడ్డారు అనే చెప్పాలి.

 ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు.అలాగే బాలకృష్ణ కి కూడా హిట్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఆయనకి చివరగా క్రిష్ డైరెక్షన్ లో చేసిన గౌతమి పుత్ర శతకర్ణి సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆయనకి ఒక్క హిట్ రాలేదు.ఇక వెంకటేష్ కూడా సోలో హిట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ స్టార్ హీరోస్ చూడని హిట్స్ అంటూ ఉండవు కానీ ప్రస్తుతం నడుస్తున్న యంగ్ హీరోల ట్రెండ్ తో పోటీపడలి అంటే వీరు ఖచ్చితంగా హిట్స్ ఇస్తూనే ఉండాలి.అలా టాలీవుడ్ స్టార్ ఫాథర్స్ కి ప్రస్తుతం కొంచెం హిట్ కోసం ఇబ్బందిగానే ఉన్నారు. అయితే చిరు ఆచార్య , బాలయ్య అఖండ సినిమాల టీజర్స్ చూస్తుంటే మాత్రం ఈ ఇబ్బంది ఎక్కువకాలం ఉండేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: