కరోనా సెకండ్ వేవ్ వల్ల మే నెల నుండి రిలీజ్ అవ్వాల్సిన తెలుగు మూవీస్ అన్ని వాయిదా పడ్డాయన్న సంగతి తెలిసిందే. తెలంగాణా, |ఏపీ ప్రభుత్వాలు థియేటర్లు తెరచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినా సరే ఇప్పటివరకు వెయిట్ చేశారు. జూలై 30న రెండంటే రెండు చిన్న సినిమాలు తమ లక్ టెస్ట్ చేసుకున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా రారా అన్న ఆలోచనతోనే సినిమాలు రిలీజ్ చేయగా అనుకున్నట్టుగానే ఆ రెండు సినిమాలకు ఏమంత ప్రేక్షకాదరణ దక్కలేదని తెలుస్తుంది.

ఇదిలాఉంటే ఈ సినిమాల ఫలితాలు మీడియం రేంజ్, పెద్ద సినిమాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఒకవేళ పరిస్థితి అంతా నార్మల్ గా ఉంటే మాత్రం వరుస మూవీస్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నందమూరి బాలకృష్ణ అఖండ రెండు మూవీస్ పోటీకి సిద్ధమవుతున్నట్టు టాక్. అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎనౌన్స్ చేయగా ఇది కాదని దసరా బరిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మూవీ ఆచార్య. ఈ మూవీ భారీ అంచనాలతో వస్తుండగా ఈ మూవీతో పాటుగా బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తుంది అఖండ. బాలయ్య, చిరు బాక్సాఫీస్ ఫైట్ షురూ అయితే మరోసారి మెగా నందమూరి బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయినట్టే. మరి ఈ రెండు మూవీస్ ఒకేసారి వస్తాయా లేదా అన్నది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఈ మూవీస్ తో పాటుగా రిలీజ్ అవ్వాల్సిన చాలా కూడా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే థియేటర్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నా జనాలు వస్తారా రారా అన్న అనుమానం మాత్రం కొనసాగుతూనే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: