చిన్న సినిమాల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు మారుతి. ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌నే చెప్పాలి. కాగా ఇప్పుడు ఆయ‌న మ‌రో సినిమా చేసేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయ‌న వరుస మూవీల విజయాలతో జోరుమీదున్నారనే చెప్పాలి. టాలీవుడ్లో చిన్న మూవీల‌తోనే తన కెరీర్ స్టార్ట్ చేసిన మారుతి విక్టరీ వెంకటేష్ నాచురల్ స్టార్ నాని అలాగే ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లాంటి వారితో మంచి హిట్ కొట్టాడు.

ఇక ప్రస్తుతం మారుతికి మంచి రోజులొచ్చాయి అనే మూవీని తెరకెక్కించడంలో బిజీ అయ్యార‌నే చెప్పాలి. కాగా ఆయ‌న తీస్తున్న కొత్త మూవీతో సంతోష్ శోభన్, అలాగే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా  ప్రధాన రోల్స్ చేస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ మారుతి అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్‌లోనే మంచి స‌న్నిహిత్యం ఉన్న‌ట్టు చెప్తుంటారు చాలామంది. కాగా ఆయ‌న్ను లేటెస్టుగా ఓ ప్ర‌శ్న‌ అడుగుతూ అల్లు అర్జున్ తో మీరు ఎలాంటి ప్రాజెక్టు తీయాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌శ్నించారు కొంద‌రు.

కాగా దీనికి స‌మాధానం చెప్పారు డైరెక్ట‌ర్ మారుతి. ఆయ‌న మాట్లాడుతూ యానిమేషన్ మూవీ సమాధానం చెప్పారు. తాను ఇప్పుడు అల్లావుద్దీన్ లాంటి యానిమేషన్ మూవీలు మాత్ర‌మే చేయాలనే ఆలోచనలో ఉన్న‌ట్టు వివ‌రించారు. తనతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా యానిమేషన్ మూవీలంటే ఎంతో ఇష్ట‌ప‌డుతాడ‌ని వివ‌రించారు. తామిద్ద‌రికీ ఇలాంటి మూవీ ప్లాన్ చేయాల‌నే కోరిక గ‌తంలో కూడా ఉంద‌ని అది ఇప్పుడు నెర‌వేరుతోంద‌ని వివ‌రించారు.

అయితే ఇక్క‌డే ఓ ప్ర‌శ్న కూడా వ‌స్తోంది. యానిమేషన్ సినిమా అనేది స్టార్ హీరో అల్లు అర్జున్ తో తీస్తే అది ఎంత వరకూ ప్రేక్షకులని ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌నేదే ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ మధ్య విప‌రీతంగా ఇండియాలోనే పెద్ద యానిమేషన్ మూవీలు ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదనే చెప్పాలి. గ‌తంలో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు విక్రమసింహ లాంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. మ‌రి ఇప్పుడు అల్లు అర్జున్ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: