మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యే అధికారికంగా ఈ సినిమా ప్రారంభం కూడా అయింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, రన్ బీర్ కపూర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ కెరియర్ మొదలుపెట్టిన 'జెంటిల్ మెన్' సినిమా నుండి 'రోబో 2.O' సినిమా వరకు ఎక్కువ శాతం సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక సినిమాలు తీస్తూ విజయాలను అందుకున్నాడు. అయితే ఈ తరహా లోనె రామ్ చరణ్ తో శంకర్ తీయబోయే సినిమా కూడా ఒక సందేశాత్మక సినిమా అని సమాచారం అందుతుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో కార్పొరేట్ సంస్థలు భారతీయ చట్టాలను అడ్డుపెట్టుకొని ఎలా కోట్లు దండుకుంటున్నారు ఆనేదాన్ని చూపిస్తున్నారని తెలుస్తోంది. చట్ట ప్రకారం డబ్బులు సంపాదించకుండా అక్రమంగా డబ్బులు సంపాదించే వారికి బుద్ధి చెప్పే పాత్రలో రామ్ చరణ్ కనబడబోతున్నట్లు తెలుస్తోంద.

ఈ సినిమాలో శంకర్ , రామ్ చరణ్ ని కలెక్టర్ గా చూపించబోతున్నాడు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో రామ్ చరణ్ ఏ పాత్రలో కనబడుతున్నాడు అనేదాని గురించి చిత్రబృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థలో 50 వ సినిమాగా రూపొందుతోంది. అందువల్ల ఈ సినిమాను దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: