టాలీవుడ్ లోకి జయం సినిమాతో 2002 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ సినిమాని అందుకున్న ఒక యంగ్ హీరో నితిన్. ఇక ఈయన తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నితిన్ కెరియర్ ను నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సదా సూపర్ గా నటించిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా హైలెట్ గోపీచంద్. తన విలనిజంతో బాగా అదరగొట్టాడు.


ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఆర్ పి పట్నాయక్. ఈ సినిమాలో ఏకంగా 12 సాంగులు చేశారు. ఇక ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో దిల్ సినిమా తో మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించారు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహ గ్లామర్ పాత్రలు పోషించగా వేణుమాధవ్ కామెడీ బాగా అలరించింది.. ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ మ్యూజిక్ అందించాడు.

ఇక ఆ తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా సై . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నుంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.అంతేకాదు ఈ సినిమా ద్వారా ప్రముఖ విలన్ గా గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇందులో హీరోయిన్ గా జెనీలియా నటించి బాగా మెప్పించింది.. రబ్బీ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీ ఆంజనేయం. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రముఖ పాత్ర పోషించాడు నితిన్ అలాగే చార్మి జంటగా నటించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

2012లో విక్రమ్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరించిన సినిమా ఇష్క్.. లవ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక 2013లో జయ కుమార్ కొండా దర్శకత్వం వహించిన సినిమా గుండెజారి గల్లంతయింది.. ఇక ఈ సినిమాలో కూడా నితిన్, నిత్య జంటగా నటించారు..

ఆ తర్వాత వచ్చిన హార్ట్ ఎటాక్ , అ ఆ ,భీష్మా , రంగ్ దే వంటి సినిమాలు నితిన్ కు మంచి విజయాన్ని చేకూర్చి పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: