జబర్దస్త్ లో ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు జబర్దస్త్ టీం లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్న వారిని సైతం వెనక్కి నెట్టి.. ఇక ఇప్పుడు తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ  టాప్ ప్లేస్ లోకి వచ్చాడు హైపర్ ఆది. ఇక హైపర్ ఆది స్కిట్ వస్తుంది అంటే చాలు పంచుల వర్షం కురుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అటు బుల్లితెర ప్రేక్షకులు కూడా స్కిట్ చూసి పగలబడి నవ్వుకుంటారు. అయితే కేవలం బుల్లితెర పైనే కాదు అటు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు హైపర్ ఆది. అంతేకాదు ఒకవైపు రైటర్ గా కూడా తన సత్తా చాటుతూన్నాడు. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు కూడా హైపర్ ఆది స్క్రిప్ట్ రాస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇలా ప్రస్తుతం ఈ టీవీ లో అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అయితే హైపర్ ఆది ఇప్పటివరకు స్పాంటేనియస్ గా పంచులు వేస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు..  అంతే కాదు బాగా స్క్రిప్టులు కూడా రాస్తాడు అనేది అందరికీ తెలిసిందే. కానీ హైపర్ఆది బాగా పాట పాడతాడు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. హైపర్ ఆది లో పాట పాడే టాలెంట్ కూడా ఉంది అన్న విషయం ఇటీవల బయటపడింది. ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా తగ్గేదేలే లేదంటూ ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ టీవి నిర్వాహకులు. ఇక ఈవెంట్లో భాగంగా హైపర్ ఆది తన గొంతుకు సాన పెట్టాడు. ఒక అదిరిపోయే పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.  ఇక హైపర్ ఆది పాట పాడుతున్నంత సేపు ఇది నిజమా కాదా అని నమ్మలేక పోయారు ప్రేక్షకులు . హైపర్ ఆది పాట పాడిన తర్వాత అక్కడే ఉన్న జడ్జీలు మాట్లాడుతూ ఆది పాట పాడాడు అంటే ఇంకా నమ్మాలి అనిపించడంలేదు అంటూ కామెంట్ చేస్తారు. దీంతో మరో పాట అందుకుంటాడు హైపర్ ఆది. ఈ పాట దాని అర్థం ఏంటో చెప్పాలి అడగడంతో అలాంటివి అడగొద్దు రా అంటూ పంచు వేస్తాడు దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: