టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలీష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్..మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఎంత ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా..మనలో టాలెంట్ లేకపోతే ప్రేక్షకులు మనల్ని ఆదరించరు..ఇది అందరికి తెలిసిన విషయమే. అల్లు అర్జున చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కానీ.. తన సొంత టాలెంట్ తో..విభిన్నమైన కధలతో..ఆకర్షించే కంటెంట్ ఉన్న స్టోరీలను చూస్ చేసుకుంటూ.. తన చలాకీతనంతో డైరెక్టర్స్ ను క్లోజ్ చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు.

ముఖ్యంగా బన్నీ డ్యాన్స్ ఇరగదీస్తాడు. ఆయన డ్యాన్స్ అంటే అభిమానులకు పిచ్చ  ఇష్టం. అంత క్రేజ్ ఉంది ఆయన డ్యాన్స్ కు . ప్రస్తుతం "పుష్ప" సినిమా ద్వారా మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాని లెక్కల మాస్టర్ అదేనండి దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఈ కాంబో లో సినిమా వస్తే బొమ్మ దద్దరి ల్లాసిందే. ఈ సినిమాలో మొదటి సారిగా నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన బన్నీ పక్క నటిస్తుంది. ఈ సినిమాను క్రిస్మస్ సంధర్భంగా డిసెంబరు 17న్ రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం.

కాగా, బన్నీ తండ్రి అల్లు అరవింద్  రీసెంట్ గా జెర్సీ హిందీ మూవీ ట్రైలర్ లాంచ్  కార్య‌క్ర‌మానికి హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు.  షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, ఇలా బడా సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యారు. ఇక  ఈ క్ర‌మంలో మీడియా అల్లు అరవింద్ ని  కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ నేపధ్యంలోనే  "సార్..మీరు బాలీవుడ్, టాలీవుడ్ బడా స్టార్ హీరోల తో పాన్ ఇండియా లెవల్ ఏదైనా మల్టీస్టారర్ సినిమా ను ప్లాన్ చేస్తున్నారా?" అని మీడియా ప్రశ్నించగా..అల్లు అరవింద్ రిప్లై ఇస్తూ.. "అది ఇప్పుడు చెప్పే స‌మ‌యం కాదు.. కరెక్ట్ టైం వచ్చిన్నప్పుడు సరైన స్థ‌లంలోనే దాని గురించి చెబుతాను" అని అన్నాడు. ఒక్కవేళ సినిమా తీసే ఆలోచన లేకపోతే లేదు అని చెప్పేసేవాడు గా.. తరువాత చెప్తా అంటే ఆయన మనసులో ఏదో భారీ ప్లాన్ ఉండనే ఉంటుంది అంటున్నారు నెటిజన్స్. దీంతో  హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ తో కలిసి అరవింద్ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు హం చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: