సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు ఈ విషయం మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం అలానే పాతుకుపోతారు అలాంటి వారిలో ఒకరు ఈ అందాల తార నయనతార. లేడీ అమితాబ్ గా పేరు సంపాదించుకున్న ఈ లేడీ ఆటో బాంబ్.. తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్ లకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. సినిమా లోకి అడుగు పెట్టి చాలా కాలమే అయినా కూడా ఇప్పటికి హీరోయిన్స్ గా ఆఫర్లు అందుకుంటూ..సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కోలీవుడ్ లో ఈమె నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే..ఆ టైంలో రిలీజ్ చేయాలి అనుకున్న స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకుంటారట. అంటే ఆమె స్దాయి ఏ రేంజ్ లో ఉందో అర్ధంచేసుకోవచ్చు. అక్కడ టాప్ హీరోలుకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఒక్కే ఒక్క హీరోయిన్ నయన తార అని మీడియాలో వార్తలు వినిపించాయి.

 సినిమా కంటెంట్ ల విషయంలో అమ్మడు రాజీ పడనే పడదట. స్టోరీ నచ్చితేనే సైన్ చేస్తుందట. లేకపోతే కోట్లు ఇచ్చినా ఆ ప్రాజెక్ట్ కి ఒప్పుకోదట.  అటు తమిళంలోను ఇటు తెలుగులోను  సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో నయనతార సినిమాలు చేస్తుందనే చెప్పాలి. ఇక తెలుగులో కూడా  అమ్మడు మంచి  మార్కెట్ సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు ..సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ గా మారింది. అందుకే కాబోలు తెలుగులోను,తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది నయనతార.

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను తన నటనతో మెప్పించిన నయన్ తన ప్రియుడు  విఘ్నేష్  ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కనుంది. ఇక దానికి సంబంధించిన పనులను అమ్మడు దగ్గర ఉండి చూసుకుంటుందట. ఇక పెళ్లి తరువాత తన భర్త తో కలిసి ఉండడానికి న‌య‌న‌తార చెన్నైలోని పొయెస్‌ గార‍్డెన్‌లో ఓ పెద్ద ఇళ్లును కొనుకున్నారట. నాలుగు బెడ్ రూంస్ ..పెద్ద బాల్కని, స్విమ్మింగ్ పూల్, అన్నీ సకల సౌకర్యాలు ఉండేలా తన డ్రీం హౌస్ ని కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఇంటి కోసం నయన్ కొన్ని కోట్లు ఖర్చు చేసిన్నట్లు తెలుస్తుంది. పెళ్లి త‌ర్వాత కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి డైరెక్ట్ గా ఆ ఇంట్లోకి వెళ్లనుందని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే చోట తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, సూపర్ స్టార్ రజనీకాంత్‌ ల నివాసాలు ఉండడం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: