బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సామాన్యులు సైతం సినీ సెలబ్రిటీలు గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం సెలబ్రిటీ హోదాను సంపాదించుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వరుస అవకాశాలు అందుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది అరియనా. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా పని చేసేది. అప్పట్లో ఈ అమ్మడు ఎవరికీ తెలియదు అని చెప్పాలి. కానీ ఒకానొక సమయంలో సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసింది అరియనా.


 ఈ క్రమంలోనే మీ కోరిక ఏంటి అంటూ రామ్ గోపాల్ వర్మను అడుగగా.. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. చాలా మందికి సుపరిచితురాలు గా మారిపోయింది. ఇక ఈ ఒక్క ఇంటర్వ్యూ తోనే అటు బిగ్ బాస్ హౌస్ లో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ అమ్మడు దర్శనమిచ్చింది. ఇటీవలి కాలంలో సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. ఇటీవలే రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా అనే సినిమాలో కూడా నటించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియనా తనకు హీరో రాజ్ తరుణ్ పై ఉన్న కోపాన్ని బయటపెట్టేసింది. ఓసారి ఇంటర్వ్యూకి పిలిచి నన్ను వెయిట్ చేయించాడు. చివరికీ రాకుండా డబ్బింగ్ పని ఉంది అంటూ వెళ్లిపోయాడు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూకు ఇలా వెయిట్ చేయించి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే హ్యాండ్ ఇచ్చాడు. అందుకే  రాజ్ తరుణ్ పైన నాకు ఎంతగానో కోపం ఉంటుందిఅంటూ అని చెప్పుకొచ్చింది  అరియనా.

మరింత సమాచారం తెలుసుకోండి: