అప్పుడేప్పుడో విజేత సినిమా తో మొదటి సారి గా సినీ ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.. కానీ ఎన్నో సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే.."సూపర్ మచ్చి"అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి ఈ రోజున రాబోతున్నాడు.. ఈ సినిమాకి డైరెక్టర్ గా పులి వాసు దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో కథానాయికగా రచితారామ్ నటించింది. ఈ సంవత్సరం పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమాని ఈ రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక బడా ఫ్యామిలీకి అల్లుడు అయినా సరే సినిమా బాగుంటేనే హిట్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి ఏ విధంగా చూసిన ఎక్కడ ఎక్కువగా ప్రచారం కనిపించలేదు.ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను సరిగ్గా మెప్పించలేకపోయింది. దీంతో బిజినెస్ అంతంత మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..

1). నైజాం-45 లక్షలు
2). సీడెడ్-20 లక్షలు
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే..60 లక్షలు మాత్రమే.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తె..1.25 కోట్ల రూపాయలు జరిగింది.
5). ఓవర్సీస్ బిజినెస్-5 లక్షలు.
6). రెస్టాఫ్ ఇండియా-7 లక్షలు.
7). ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ విషయానికి వస్తే..1.37 కోట్ల రూపాయలు జరిగింది.

ప్రస్తుతం ఈ సూపర్ మచ్చి సినిమా ని ఎక్కువగా నిర్మాతలే ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చేయడం జరుగుతోంది. అయినప్పటికీ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ రావాలంటే..1.45 కోట్ల ను రాబట్టాలి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే చాలా ఘోరంగా ఉన్నట్లుగా సమాచారం. ఒకవేళ ఈ సినిమాకి మంచి టాక్ వస్తే తప్ప ఇ సీజన్లో ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు ఇక వీటితోపాటుగా బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్ వంటి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: