ఈ సంక్రాంతికి పండుగ లాంటి సినిమా అందించాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు అక్కినేని హీరోలతో బంగార్రాజు లాంటి అద్భుతమైన సినిమా అందిచాడు ఈ డైరక్టర్. సినిమా కథ కోసం చాలా ఏళ్లు కష్టపడినా ఫైనల్ గా ఆడియెన్స్ కి పండుగ టైం లో నిజంగానే పండుగ సందడి రెట్టింపు చేసే సినిమాగా బంగార్రాజు వచ్చింది. ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ టాలెంట్ మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తన సెకండ్ సినిమా మాస్ మహరాజ్ రవితేజతో నేల టిక్కెట్టు సినిమా తీశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా కళ్యాణ్ కృష్ణ మీద నమ్మకంతో బంగార్రాజు ప్రాజెక్ట్ ని ఇచ్చారు నాగార్జున. నాగ్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ కృష్ణకి మరో సూపర్ ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ స్టూడియో గ్రీన్ నుండి బంగార్రాజు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణకు మూవీ ఛాన్స్ వచ్చింది. బంగార్రాజు హిట్ అయినందుకు డైరక్టర్ ని విష్ చేస్తూ స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవెల్ రాజా కళ్యాణ్ కృష్ణని కలిశారు.

ఈ విషయాన్ని తెలియచేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ చేశారు కళ్యాణ్ కృష్ణ. స్టూడియో గ్రీన్ తో సినిమా అంటే ఖచ్చితంగా సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా తెలియలేదు. తెలుగు హీరో ఉంటాడా లేక తమిళ హీరోతో చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. జ్ఞానవెల్ రాజా సినిమా అంటే సూర్య, కార్తీ లలో ఒకరు హీరోగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కాస్ట్ అండ్ క్రూ మిగతా ఇంట్రెస్టింగ్ డీటైల్స్ త్వరలో రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: