టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి అందాల కథానాయిక గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమా పరిశ్రమలో సినిమాలు చేస్తూ వచ్చిందని చెప్పాలి. తెలుగులో ఆమె హీరోయిన్ గా హీరో అనే చిత్రంలో నటించింది తాజాగా. అయితే ఓ కొత్త హీరోతో నిధి అగర్వాల్ నటించడం పట్ల ఆమె అభిమానులు అప్పట్లో తీవ్రమైన నిరాశ వ్యక్తపరిచారు. అయితే ఆమె ఈ సినిమా చేయడానికి కారణం లేకపోలేదట.

అందానికి అందం అభినయానికి అభినయం కలిగి ఉన్న నిధి అగర్వాల్ తో సినిమా చేయాలని అందరు హీరోలు కూడా ఆసక్తి చూపించారు. ఆ ఆసక్తికి తగ్గట్లుగానే ఆమె భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉండటంతో పవన్ కళ్యాణ్ లాంటి హీరో సరసన ఆమె నటించడం విశేషం. క్రిష్ దర్శత్వంలో నీ హరిహర వీరమల్లు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాత తప్పకుండా భారీ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుంది అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమా పరిశ్రమ లో సైతం ఆమె వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వుంటుంది.

అయితే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ పోతున్న ఈ ముద్దుగుమ్మ ఓ కొత్త హీరోతో ఎలాంటి స్టార్ డం లేని హీరోతో రొమాన్స్ చేయడం పట్ల అందరూ ఎంతో ఆశ్చర్యం తో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకు నిధి అగర్వాల్ స్టార్ సినిమాలు చేయకుండా ఇలా చేస్తోందని కామెంట్లు కూడా చేశారు. అయితే ఆమె ఇలా సినిమా చేయడానికి ప్రధాన కారణం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే అని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు.  రెమ్యునరేషన్ అయితే అందింది కానీ క్యారక్టర్ మాత్రం వారు చెప్పిన రేంజ్ లో మాత్రం లేదు.. అంతంత మాత్రమే ఆమె పాత్ర సినిమాలో ఉంది . ఈ సినిమా నిధి అగర్వాల్ కెరీర్ కు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ రేంజ్ ఏ విధంగా మారుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: