టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన హరీష్ శంకర్, రవితేజ హీరోగా తెరకెక్కిన మిరపకాయ్ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా అవకాశం దక్కింది. అయితే గబ్బర్ సింగ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించడంతో టాలీవుడ్ లో ఈ దర్శకుడికి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది, ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలు తెరకెక్కాయి, ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయాలు సాధించాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న హరీష్ శంకర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో  చేసిన కామెంట్ వైరల్ గా మారింది, గేయ రచయిత భాస్కర్ బట్ల తన సోషల్ మీడియా ఖాతాలో  ‘అలిసిన పక్షులు వాలేందుకైనా ఆసరా అవుతున్నానని ఆనందపడిపోతోంది ఎండిన చెట్టు!!’ అని ఒక లైన్ ని రాసి పోస్ట్ చేశారు. భాస్కర్ బట్ల  రాసిన ఆ లైన్ హరీష్ శంకర్ ను ఆకట్టుకుంది, భాస్కర్ బట్ల పోస్ట్ కు రిప్లే ఇస్తూ.. ‘‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’ అంటూ హరీష్ శంకర్ కామెంట్ చేశాడు. అయితే హరీష్ శంకర్ కామెంట్ కు స్పందించిన భాస్కర్ బట్ల థ్యాంక్స్ అన్నయ్యా అని రిప్లే ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: