ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ భాషలో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సార్ హీరోయిన్ గా తన హవా నడిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదికి వచ్చింది అంటే చాలు అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫార్మ్ అయిపోతుంది అని చెప్పాలి. ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా మారిపోయింది. దీంతో ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఇక వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఒకవైపు సినిమాలతో అలరిస్తున్న పూజా హెగ్డే  మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులనూ మతిపోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవలే ముంబైలో కొత్త ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం కూడా చేసింది. ఇకపోతే ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఆసక్తికర  వ్యాఖ్యలు చేసింది.ఇల్లు కొనడం వల్ల మీ కల నెరవేరింది అని మీకు అనిపిస్తుందా అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అవును నా కల నిజమై నట్లు అనిపిస్తుంది. నిజానికి నేను అమ్మాయిలకు చెప్పదలుచుకున్నది కూడా  ఇదే. కలలు కనడానికి వయసుతో సంబంధం ఏముంది అంటూ పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. దక్షిణాదికి చెందిన ఒక సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నా కలను నెరవేర్చుకున్న అంటూ పూజాహెగ్డే తెలిపింది. ఇక హార్డ్వర్క్ మన కలల్ని నెరవేరుస్తుంది. అమ్మాయిలందరూ.. మిమ్మల్ని మీరు నమ్మండి కలలు కనండి మీ హార్డ్ వర్క్ ద్వారా అవి నెరవేరినప్పుడు ఆ కళకు ఒక వాల్యూ ఉంటుంది. మీరు ఏ వృత్తిలో కొనసాగుతున్నారు అన్నది ముఖ్యం కాదు..100% కష్టపడుతున్నారా లేదా అన్నది ముఖ్యం.. 100% కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తూ ఉంటుంది అంటూ పూజా హెగ్డే అమ్మాయిల అందరికీ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రభాస్ తో జోడి కట్టిన పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సమ్మర్లో ఇళయదళపతి విజయ్ తో నటించిన బీస్ట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: