తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు సినీ క్రాఫ్ట్స్ లో పనిచేసేవారు బంధువులు గా ఉన్నారు. అలాగే, నటీనటులలో కూడా బంధువులు ఉన్నారు. అలాగే, పరిశ్రమ లో అగ్ర స్థాయి కుటుంబాల్లో ఒకటైన నందమూరి కుటుంబానికి కూడా పరిశ్రమలో పలు విభాగాల్లో బంధువులు ఉన్నారు. ఆ కుటుంబానికి చెందిన ప్రస్తుత హీరోల్లో అగ్రగణ్యుడు నట సింహం నందమూరి బాలకృష్ణ గారి తోడల్లుడు కూడా పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ , ఎవరో తెలుసా ? 



బాలకృష్ణ గారి తోడల్లుడు యం. ఆర్.వి.ప్రసాద్. ఈయన బాలకృష్ణ సతీమణి వసుంధర గారి సోదరి భర్త.  స్వహతగా పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ప్రసాద్ అమెరికా లోని అలబామా యూనివర్సిటీ లో ఎంబీఏ పూర్తి చేసి తమ కుటుంబానికి చెందిన బిజినెస్ లో చేరారు.ప్రసాద్ కు మొదట్లో సినిమాలు అసలు ఆసక్తి లేదంట బిజినెస్ మీద ఆసక్తి ఉండేది అంట కానీ ఎప్పుడైతే హీరో బాలకృష్ణ తన తోడల్లుడు అయ్యాడో సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. 

 

సినిమాల గురించి బాలకృష్ణ తో చర్చించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ వచ్చేవారు. ప్రసాద్ లోని ఆసక్తి గమనించిన బాలకృష్ణ ,తను నటించే సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూడమని పురామయించారు.80ల మధ్యల్లో బాలకృష్ణ నటించిన కొన్ని సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ పనుల్లో ప్రసాద్ పాలుపంచుకున్నారు. సినీ నిర్మాణం మీద పూర్తి అవగాహన వచ్చిన బాలయ్య, తను కలిసి  ప్రియదర్శిని - బ్రాహ్మణి ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి బాలకృష్ణ హీరోగా బాలగోపాలుడు చిత్రం నిర్మించారు. ఈ చిత్రంతోనే హీరో కళ్యాణ్ రామ్ బాల నటుడుగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. 



బాలగోపాలుడు చిత్రం విజయం సాధించడంతో ప్రసాద్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా నిలద్రొక్కుకున్నారు. ఆ తర్వాత వెంటనే  బాలకృష్ణ తోనే పలు సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నా బాలకృష్ణ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రయత్నాలు విరమించారు.  1999లో తిరిగి  బాలకృష్ణ  హీరోగా సుల్తాన్ చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా హీరో , విలన్ కూడా ఆయనే అవ్వడం మరో విశేషం. ఈ సినిమా కూడా బాగా విజయం సాధించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ప్రసాద్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఏదిగారు.



ఆ తర్వాత  ఒక చిన్న చిత్రం చేసినా ఫ్లాప్ అవ్వడంతో ప్రసాద్  కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా 2006 లో బాలకృష్ణ హీరోగా అల్లరి పిడుగు చిత్రం నిర్మించారు. ఈ చిత్రం  యావరేజ్  గా నిలిచిన ప్రసాద్ కు లాభాలు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ప్రసాద్ నిర్మాణం కు దూరమైన బాలకృష్ణ సినిమా లకు ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. బాలకృష్ణ మొదటి సారి నిర్మాత గా నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు చిత్రాలకు ప్రసాద్ నిర్మాణ వ్యవహారాలు తానే స్వయంగా చూసుకున్నారు. ప్రసాద్ ప్రస్తుతం తన బిజినెస్ లలో బిజీగా ఉన్న మంచి కథలు వస్తే నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: