ప్రభాస్ ఆతిధ్యం తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ప్రభాస్ ఎవరినైనా తన ఇంటికి లంచ్ కి పిలిస్తే వారంతా హడిలిపోతారు. దీనికికారణం ప్రభాస్ ఇంటి భోజనంలో అతిధులకు వడ్డించే రకరకాల డిష్ లు తినడానికి చాలామంది తమ శక్తి సరిపోవడంలేదు అంటూ గగ్గోలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి హీరోయిన్ దిషా పఠాని కి ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో దీపికా పదుకొనె తో పాటు దిషా పఠాని కూడ నటిస్తోంది. ఆమె ఈమధ్య ఈసినిమాకు సంబంధించి షూటింగ్ స్పాట్ కు వచ్చినప్పుడు ఆమెకు ప్రభాస్ అందమైన ఫ్లవర్ బొక్కేతో పాటు కొన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కూడ పంపాడట. అవి చాలవు అన్నట్లుగా ఆమరుసటి రోజున ఆమె ఉంటున్న హోటల్ రూమ్ కు డిన్నర్ అంటూ రకరకాల డిష్ బాక్స్ లను సుమారు 11 హాట్ ప్యాక్స్ పంపడంతో వాటిని దిషా ఫోటోలు తీసి ప్రభాస్ తన ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టింది.


అంతేకాదు ఈమూవీలో మరో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక హైదరాబాద్ లో ఉన్నంతసేపు ప్రభాస్ పంపిన రకరకాల డిషస్ తినలేక ఇబ్బంది పడిన సందర్భాన్ని అదేవిధంగా 77 సంవత్సరాల అమితాబ్ కూడ ప్రభాస్ ఆతిధ్యాన్ని తట్టుకోలేకపోయిన విషయాన్ని గుర్తుకు చేసింది. ఆమధ్య కమెడియన్ ఆలీ కూడ ప్రభాస్ ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఎవర్ని అయినా తన ఇంటికి భోజనానికి పిలిస్తే కనీసం ఒకరోజు ఉపవాసం చేసి అతడి ఇంటికి వెళ్ళడం మంచిది అంటూ అని జోక్ చేసిన విషయం తెలిసిందే.


ప్రభాస్ స్వతహాగా భోజన ప్రియుడు రకరకాల దేశీయ విదేశీయ వంటలను తినడం అతడి హాబి. అయితే ప్రభాస్ ప్రస్తుత లుక్ లో వస్తున్న మార్పులకు అతడి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ప్రభావం చూపెడుతున్నాయా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: